మంచి పరిచయాలతో ఈ రాశుల వారికి అదృష్టం..! వారి జీవితాల్లో కొత్త టర్న్‌కు ఛాన్స్

ఈ ఆధునిక కాలంలో ఎవరికి ఎటువంటి పరిచయాలు, కనెక్షన్లు ఏర్పడతాయన్న దానిని బట్టే జీవిత పురోగతి ఆధారపడి ఉంది. జ్యోతిషశాస్త్రం ఇటువంటి పరిచయాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఈ శాస్త్రాన్ని బట్టి లాభ స్థానమే, అంటే 11వ స్థానమే మంచి పరిచయాలను నిర్దేశిస్తుంది. శాస్త్రం ప్రకారం లాభ స్థానమే పురోగతిని కూడా నిర్దేశిస్తుంది.

మంచి పరిచయాలతో ఈ రాశుల వారికి అదృష్టం..! వారి జీవితాల్లో కొత్త టర్న్‌కు ఛాన్స్
Luck Astrology
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 11, 2024 | 7:04 PM

ఈ ఆధునిక కాలంలో ఎవరికి ఎటువంటి పరిచయాలు, కనెక్షన్లు ఏర్పడతాయన్న దానిని బట్టే జీవిత పురోగతి ఆధారపడి ఉంది. జ్యోతిషశాస్త్రం ఇటువంటి పరిచయాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఈ శాస్త్రాన్ని బట్టి లాభ స్థానమే, అంటే 11వ స్థానమే మంచి పరిచయాలను నిర్దేశిస్తుంది. శాస్త్రం ప్రకారం లాభ స్థానమే పురోగతిని కూడా నిర్దేశిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. మంచి పరిచయాలనేవి ఒక లిఫ్టు లాంటివి. అవి తప్పకుండా పైకి తీసుకువెడతాయి. ప్రస్తుతం మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి లాభ స్థానం శుభప్రదంగా ఉంది. ఇది ఈ ఏడాదంతా కొనసాగుతుంది.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి శనే సంచరిస్తున్నందువల్ల రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూసుకుపోయే తత్వం కలిగిన మేష రాశివారు ఈ పరిచయాల ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కొత్త పరిచయాలన్నీ ఉన్నత స్థాయికి చెందిన పరిచయాలే అవుతాయి. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో సైతం ఈ పరిచయాలు బాగా ఉపయోగపడతాయి. కొద్దిగా నిదానంగానే అయినా తప్పకుండా ఆశించిన పురోగతి ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో రాహు సంచారం వల్ల తప్పకుండా లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. సమాజంలో బాగా పట్టూ, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. సన్మార్గులతోనే కాకుండా దుర్మార్గులతో కూడా పరిచయాలు పెంపొందే అవకాశం ఉంది. ఈ పరి చయాలు వృత్తి, వ్యాపారాలకు బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో సాన్నిహిత్యం పెరిగి, పదోన్నతులు, భారీ జీతభత్యాలు సంపాదించడం తప్పకుండా జరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గురు సంచారం వల్ల తప్పకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో, సంప న్నులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వారి వల్ల వృత్తి, వ్యాపారాలు నిలదొక్కుకుని, అభివృద్ధి చెందడంతో పాటు, అంచనాలకు మించిన లాభాలు గడిస్తాయి. అధికారులతో సాన్నిహిత్యం కార ణంగా ఉద్యోగ జీవితంలో పదోన్నతులతో పాటు, భారీ జీతభత్యాలు లభించడం జరుగుతుంది. సామాజికంగా కూడా రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. శీఘ్రగతిన పురోగతి చెందే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశివారికి లాభస్థానంలో రెండు శుభ గ్రహాల సంచారం కారణంగా పరిచయాల పరంగా విశే షమైన అదృష్టం పడుతుంది. విభిన్న వర్గాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఈ పరిచయాల వల్ల ఆదాయమూ పెరుగుతుంది. అధికారమూ వృద్ధి చెందు తుంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ కొత్త పరిచయాలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలిగిస్తాయి. ఈ రాశివారు ప్రతి పరిచయాన్నీ లాభదాయకం చేసుకోవడం జరుగుతుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నందువల్ల చిత్ర విచిత్రమైన, అనూహ్యమైన పరిచయాలు పెంపొందుతాయి. ప్రస్తుతం కొత్తగా ఏర్పడే ప్రతి పరిచయమూ లాభదాయకంగా మారే అవకాశం ఉంది. అనేక వర్గాలకు చెందిన వారితో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఇవి తప్పకుండా దీర్ఘకాలిక లేదా శాశ్వత పరిచయాలే అవుతాయి. హోదాలు పెరగడం కంటే, ఆదా యం పెరగడానికి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికే ఈ పరిచయాలు దోహదం చేస్తాయి.
  6. మకరం: ఈ రాశికి లాభ స్థానం మీద శుభ గ్రహాల దృష్టి ఎక్కువగా ఉండడం వల్ల కొత్త పరిచయాల కారణంగా అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఉన్నత స్థాయి అధికారులతో, రాజకీయ ప్రముఖులతో, సంపన్నులతో పరిచయాలు వృద్ధి చెందడం వల్ల ఈ రాశివారికి ఆదాయ మార్గాలు పెరగడం, బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందడం, జీవనశైలి మారడం వంటివి జరుగుతాయి. ఉద్యోగ జీవితంలో అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల తీరు మారిపోతుంది.

బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!