Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 13, 2024): మేష రాశి వారి కుటుంబంలో అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి నిరుద్యోగులకు బాగా దగ్గర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో తొందరపాటుతనంతో వ్యవహరించకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జూలై 13, 2024): మేష రాశి వారి కుటుంబంలో అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి నిరుద్యోగులకు బాగా దగ్గర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో తొందరపాటుతనంతో వ్యవహరించకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
చెల్లింపులు, ఖర్చులు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ధనపరంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబంలో అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలు పరిష్కారమై, కాస్తంత మనశ్శాంతి ఏర్ప డుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే సూచనలున్నాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికి రాదు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. వృత్తి జీవితంలో ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు బాగా దగ్గర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
కుటుంబ సభ్యులతో తొందరపాటుతనంతో వ్యవహరించకపోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధువుల నుంచి విమర్శలు వచ్చే సూచనలున్నాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యలకు ఊహిం చని పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. సరైన వైద్య చికిత్స లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలో చనలు బాగా కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఉద్యోగ జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలకు అవకాశం లేదు. వృత్తి, వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాలకు సానుకూలపడతాయి. మిత్రులకు బాగా సహాయం చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కుటుంబంలో మధ్య మధ్య చికాకులు తలెత్తుతుంటాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కూడా లాభాలకు లోటుండదు. బంధుమిత్రులతో కొద్దిగా సామరస్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటుతనం పనికి రాదు. ఆశించిన శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశిం చిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరిగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవ హారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ యోగం పడుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఏ పని తలపెట్టినా పూర్తయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల మీద ఆధారపడి ఉపయోగం ఉండదు. ఆర్థిక పరి స్థితి బాగానే ఉంటుంది కానీ, కొద్దిగా మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉండదు. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగి పోతుంది. వృత్తి, ఉద్యోగాలు పరవాలేదనిపిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా మాత్రమే పెరుగు తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికార యోగం పట్టే సూచనలున్నాయి. జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ వస్తుంది. వృత్తి జీవితం ఆశించిన మలుపు తిరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారా లన్నీ సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సోదరులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గిపో తుంది. చేపట్టిన పనుల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగ వాతావ రణం ఉత్సాహం కలిగిస్తుంది. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యో గాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలుండవు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి బాగా పెరుగు తుంది. బంధుమిత్రులతో కొద్దిపాటి వివాదాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. సద్వినియోగం చేసుకోవడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందక పోవచ్చు. ఆదాయ ప్రయత్నాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సాయపడతారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభ సాటిగా సాగిపోతాయి. పిల్లలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఏ పని తలపెట్టినా తప్పకుండా విజయ వంతం అవుతుంది. కొందరు బంధువుల నుంచి విమర్శలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు ఉండకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. వాహన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.