Zodiac Signs: సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
Zodiac Signs: 2026, ఫిబ్రవరి నెలలో సూర్య సంచారము మూడుసార్లు జరుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఫిబ్రవరి 6న సూర్యుడు ధనిష్ట నక్షత్రానికి వెళ్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 13న సూర్యుడు మకరరాశిని వదిలి కుంభ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 19న సూర్యుడు శతభిష నక్షత్రంలోకి వెళ్లనున్నాడు. సూర్యుడు మూడుసార్లు తన స్థానాన్ని మారుస్తాడు. దీని కారణంగా కొన్ని రాశి గుర్తులు సానుకూల ఫలితాలను పొందుతాయి.

Sun Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాలు క్రమం తప్పకుండా తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఈ గ్రహాల కదలికలు 12 రాశులపై ఏదో ఒక రకమైన ప్రభావాన్ని చూపుతాయి. 2026, ఫిబ్రవరి నెలలో సూర్య సంచారము మూడుసార్లు జరుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఫిబ్రవరి 6న సూర్యుడు ధనిష్ట నక్షత్రానికి వెళ్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 13న సూర్యుడు మకరరాశిని వదిలి కుంభ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అనంతరం ఫిబ్రవరి 19న సూర్యుడు శతభిష నక్షత్రంలోకి వెళ్లనున్నాడు. సూర్యుడు మూడుసార్లు తన స్థానాన్ని మారుస్తాడు. దీని కారణంగా కొన్ని రాశి గుర్తులు సానుకూల ఫలితాలను పొందుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ధనస్సు రాశి
సూర్యుని స్థానం మార్పు ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా సూర్యుని స్థానం మార్పు సమయంలో మీరు మీ ధైర్యాన్ని పెంచుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతలు లభించే అవకాశం ఉంది. మీరు మీ కెరీర్‌లో మంచి వృద్ధిని సాధిస్తారు. మీకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
సింహరాశి
సింహ రాశి వారికి త్రికాల సంచార సమయంలో సూర్యుడు అనుకూలంగా ఉంటాడు. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీకు కొత్త ఆర్థిక లాభాలు వస్తాయి. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పాత అప్పులు తీర్చేస్తారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ ప్రేమను కుటుంబం ఆమోదిస్తుంది. వివాహ యోగం ఉంది. వివాహం కాని వారికి ఫిబ్రవరి తర్వాత మంచి సంబంధం దొరుకుతుంది. పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఈ సమయంలో శుభవార్త వింటారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. శుభప్రదమైన విషయాలు జరుగుతాయి.
మేష రాశి
మేష రాశివారికి సూర్య సంచారము వలన అనుకూల ఫలితాలుంటాయి. వృత్తి లేదా మీరు చేసే పనిలో గణనీయమైన వృద్ధి సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ కెరీర్ ఫిబ్రవరిలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. ఉమ్మడి వ్యాపారాల ద్వారా మీరు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో పోటీ తగ్గుతుంది. బంధువులతో విభేదాలు తగ్గిపోతాయి. ఇంట్లో శుభ కార్యక్రమాల ద్వారా బంధువులు ఇంటికి వస్తారు. నగలు, ఆస్తి, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు ధృవీకరించదు.)
