AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: మిథున రాశిలో రవి.. ఆ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..!

ప్రస్తుతం మిధున రాశిలో సంచారం చేస్తున్న రవి జూలై 3 నుంచి 15 వరకు కొన్ని రాశుల మీద బలమైన ప్రభావాన్ని చూపించబోతున్నాడు. మిథున రాశి మధ్యలోకి వచ్చినందువల్ల రవి బలం పెరగడం జరుగుతుంది. దీని ప్రభావంతో ఆరు రాశుల వారికి ఊహించని అదృష్టాలను తెచ్చి పెడుతుంది. ఆర్థికాభివృద్ధితో పాటు ఆర్థిక సమస్యలు తగ్గడం, అధికారం పట్టడం, ప్రతి ప్రయత్నమూ సఫలం కావడం వంటివి చోటు చేసుకుంటాయి.

Zodiac Signs: మిథున రాశిలో రవి.. ఆ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..!
Sun Gochar
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2024 | 4:23 PM

Share

ప్రస్తుతం మిధున రాశిలో సంచారం చేస్తున్న రవి జూలై 3 నుంచి 15 వరకు కొన్ని రాశుల మీద బలమైన ప్రభావాన్ని చూపించబోతున్నాడు. మిథున రాశి మధ్యలోకి వచ్చినందువల్ల రవి బలం పెరగడం జరుగుతుంది. దీని ప్రభావం మేషం, వృషభం, సింహం, కన్య, తుల, మకర రాశుల వారికి ఊహించని అదృష్టాలను తెచ్చి పెడుతుంది. ఆర్థికాభివృద్ధితో పాటు ఆర్థిక సమస్యలు తగ్గడం, అధికారం పట్టడం, ప్రతి ప్రయత్నమూ సఫలం కావడం వంటివి చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న రవి వల్ల వీరికి జీవితంలో ఊహించని పురోగతి ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాలు ఎక్కువయినప్పటికీ వాటి వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. జీవన శైలిలో మార్పు వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన ప్రదేశాలను సందర్శించడం జరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశికి చతుర్థ స్థానాధిపతిగా రవి ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. గృహ నిర్మా ణాలు బాగా అనుకూలంగా పూర్తవుతాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. మాతృమూలక ధన లాభం కూడా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సామాజికంగా కూడా పలుకుబడి విస్త రిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి.
  3. సింహం: ఈ రాశ్యధిపతి అయిన రవి లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరగడంతో పాటు, ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపా రాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.
  4. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల యోగం ఏర్పడింది. దీనివల్ల సాధారణంగా విదేశాల్లో ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. రాజకీయాల్లో లేక ప్రభుత్వంలో ఉన్నవారికి ఊహిం చని పదోన్నతులు లభిస్తాయి. ప్రభుత్వ పరంగా అనేక లాభాలు, ప్రయోజనాలు సమకూరు తాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్నవారి కలలు నెరవేరుతాయి. ఆదాయానికి లోటుండదు. విలాస జీవితం అనుభవించడం జరుగుతుంది.
  5. తుల: ఈ రాశికి లాభ స్థానాధిపతిగా రవి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా సంపద పెరుగుతుంది. మహాభాగ్య యోగం పడుతుంది. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం కలుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరు తాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఊహించని ప్రముఖులతో పరిచయాలు పెరు గుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  6. మకరం: ఈ రాశికి అష్టమాధిపతిగా షష్ట స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి విపరీత రాజ యోగం పడుతోంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందు తుంది. ఇతరులకు సహాయం చేయడం లేదా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!