Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 1, 2024): మేష రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. మిథున రాశికి చెందిన ఉద్యోగుల మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 01st July 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 01, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూలై 1, 2024): మేష రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. మిథున రాశికి చెందిన ఉద్యోగుల మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఊహించని విధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగంలో మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. బాకీలన్నీ వసూలవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొందరు మిత్రుల వల్ల సమస్యలో పడే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అదనపు బాధ్యతలతో బాగా ఇబ్బంది పడతారు. ప్రయాణాల వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలకు వెడతారు. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయవలసి వస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగి పోతుంది. వ్యక్తిగత సమస్యల వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచ నాల్ని మించుతుంది. అనుకున్న పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం క్రమంగా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగంలో పని భారం పెరగడం వల్ల బాగా ఒత్తిడి ఉంటుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. ముఖ్య మైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపయోగపడతాయి. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. పోటీదార్ల బెడద చాలావరకు తగ్గుతుంది. ఉద్యోగ జీవితం బాగా సానుకూలంగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సర్వత్రా గౌరవ మర్యా దలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ జీవితంలో అపార్థాలు తొలగిపోయి, సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారతాయి. అదనపు ఆదాయం, రాబడి బాగా వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టు కోకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆస్తి వివాదంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుం బంలో అన్యోన్యత పెరుగుతుంది. ఆస్తి సంబంధమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను సందర్శిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం పరవా లేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. రావల సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవు తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగు తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగు తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రావలసిన డబ్బు బాగా ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విహార యాత్రకు కుటుంబ సభ్యులతో ప్లాన్ చేస్తారు. వృత్తి జీవితంలో విశ్రాంతికి అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలు పంచు కునే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగానే ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు ఒక మోస్తరుగా సాగిపోతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసల వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబసమేతంగా ఆలయాలను దర్శిస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఆటంకాలు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో రావలసిన సొమ్ము వసూలవుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.