కిందపడిన పారిజాత పువ్వులతోనే పూజ ఎందుకు చేయాలి? ఇంట్లో ఈ చెట్టు ఉంటే సిరిసంపదలు వస్తాయా?

November 02, 2026

Rajashekher

సాధారణంగా కిందపడిన పువ్వులను పూజకు ఉపయోగించరు. కానీ పారిజాత పుష్పాలను మాత్రం కిందపడినవే పూజకు సమర్పించాలని చెబుతారు.

పారిజాత పువ్వులకు ప్రత్యేకత..

పారిజాత వృక్షాన్ని దైవ స్వరూపంగా పరిగణిస్తారు. ఈ పుష్పాలతో దేవుడిని పూజిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

దైవ స్వరూపంగా పారిజాతం..

పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మథనం సమయంలో ఉద్భవించింది.

సముద్ర మథనంలో ఆవిర్భావం..

పారిజాతాన్ని విష్ణువు స్వర్గానికి తీసుకెళ్లారని, అనంతరం సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చారని పురాణ కథనం.

స్వర్గం నుంచి భూలోకానికి.. 

సాధారణ పువ్వులను కోసి పూజిస్తారు. కానీ పారిజాత పువ్వులు మాత్రం చెట్టు నుంచి రాలిపోయి భూమిని తాకిన తర్వాతే స్వామికి సమర్పించాలని శాస్త్రం చెబుతుందని విశ్వాసం.

భూమిని తాకిన తర్వాతే పూజ..

పారిజాత పువ్వులను చెట్టు నుంచి కోయకుండా, సహజంగా కిందపడిన పుష్పాలను మాత్రమే ఏరుకొని పూజకు ఉపయోగిస్తారు.

కిందపడిన పువ్వులనే ఏరుకోవాలి..

కిందపడిన పారిజాత పువ్వులను శుభ్రంగా, ఆవుపేడతో అలికిన నేల నుంచి ఏరుకొని దేవుడికి సమర్పించాలని సంప్రదాయ విశ్వాసం.

శుభ్రమైన ప్రదేశం నుంచి సేకరణ..

పారిజాత చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే ఆ ఇంట్లో సిరిసంపదలు, ఐశ్వర్యం నిలుస్తాయని పురాణ వచనంగా నమ్ముతారు.

ఇంట్లో పారిజాత వృక్షం ఉంటే..