Love Astrology: రవి, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి ప్రేమ యోగాలు..!
ప్రస్తుతం రవి, శుక్ర గ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి ఈ నెలాఖరు వరకు కర్కాటక రాశిలోనే కలిసి ఉంటాయి. ఆ తర్వాత శుక్రుడు రవికి సంబంధించిన సింహ రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. మొత్తం మీద శుక్రుడి మీద నలభై రోజుల పాటు రవి ప్రభావం ఉంటుంది. ప్రేమలకు, వివాహాలకు కారకుడైన శుక్రుడికి గ్రహ రాజు రవితో సంబంధం ఏర్పడడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇక్కడ ప్రశ్న.
ప్రస్తుతం రవి, శుక్ర గ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి ఈ నెలాఖరు వరకు కర్కాటక రాశిలోనే కలిసి ఉంటాయి. ఆ తర్వాత శుక్రుడు రవికి సంబంధించిన సింహ రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. మొత్తం మీద శుక్రుడి మీద నలభై రోజుల పాటు రవి ప్రభావం ఉంటుంది. ప్రేమలకు, వివాహాలకు కారకుడైన శుక్రుడికి గ్రహ రాజు రవితో సంబంధం ఏర్పడడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఇక్కడ ప్రశ్న. సాధారణంగా మహిళలైనా, పురుషుడైనా సంపన్న వ్యక్తితో లేదా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశులవారికి సరికొత్త ప్రేమ యోగం పట్టే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్ర, రవుల యుతి జరిగినందువల్ల సాధారణంగా ఈ రాశివారు బాగా ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రుడు హోదాకు సంబంధించిన చతుర్థ స్థానంలో రవితో యుతి చెందడం వల్ల సమా జంలో మంచి పలుకుబడిన వ్యక్తి లేదా, ఉద్యోగంలో అధికారంలో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడే అవ కాశం కూడా ఉంటుంది. ఇటువంటి ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీయడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర, రవుల కలయిక జరిగినందువల్ల సాధారణంగా ఈ రాశివారు సంపన్న వ్యక్తితో లేదా వ్యాపారంలో ఉన్నవారితో ప్రేమలో పడడం జరుగుతుంది. నిజానికి భోగ భాగ్యాలకు, ఆర్జనకు లోటు లేని వ్యక్తి ఈ రాశివారి ప్రేమలో పడే సూచనలున్నాయి. ఈ రాశికి రెండవ స్థానమైన కర్కాటకం కుటుంబ స్థానం కూడా అయినందువల్ల ఈ రాశివారి ప్రేమ వ్యవ హారాలు పెళ్లి దారికి తీయడం, దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోవడం జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశిలో శుక్ర, రవుల కలయిక జరిగినందువల్ల జీవితంలో అన్ని విధాలా స్థిరపడిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. శుక్ర, రవులు సుఖ స్థానానికి, కుటుంబ స్థానానికి అధిపతులైనం దువల్ల ఈ రాశివారి ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీయడం, దాంపత్య జీవితం సుఖ శాంతులతో సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారు పరిచయస్థులతో లేదా మిత్రులతో ప్రేమలో పడడం జరుగుతుంది. పెళ్లి తర్వాత ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు, రవి కలిసి ఉన్నందువల్ల ఈ రాశివారు రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తితో గానీ, వ్యాపారంలో ఉన్న వ్యక్తితో గానీ ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుడు ధన, భాగ్యాధిపతి కావడం, రవి వ్యయాధిపతి కావడం వల్ల సాధారణంగా కులాం తర ప్రేమ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రేమ వ్యవహారం సప్రదాయబద్ధమైన వివాహానికి తప్పకుండా దారితీస్తుంది. వివాహానంతర జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది.
- వృశ్చికం: ఈ రాశికి శుక్రుడు సప్తమాధిపతి కాగా రవి దశమాధిపతి అయినందువల్ల ఈ రెండు గ్రహాలు భాగ్య స్థానంలో కలిసినందువల్ల సాధారణంగా ఉద్యోగంలో తనకంటే పైఅధికారితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఇద్దరి మధ్యా కొద్దిపాటి పరిచయం ఉండి ఉంటుంది. ఈ ప్రేమ వ్యవహారం తప్పకుండా సంప్రదాయబద్ధమైన వివాహానికి దారి తీస్తుంది. వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది.
- మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర, రవుల కలయిక వల్ల సాధారణంగా బంధువుల్లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఆలోచనా స్థానమైన పంచమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వీరికి ప్రేమ వ్యవహారాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. ఇటువంటి శుక్రుడితో రవి కలిసినందువల్ల వీరు పట్టుదలగా తమ ప్రేమ వ్యవహారంలో విజయాలు సాధి స్తారు. పంచమ స్థానంలో రవి, శుక్రులు కలవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది.