Solar Eclipse 2023: రేపు అరుదైన యోగంలో 178 ఏళ్ల తర్వాత సూర్య గ్రహణం.. ఈ ఐదు రాశులవారికి అదృష్టం సొంతం
ఈ సంవత్సరం చివరిదైన సూర్య గ్రహణం అక్టోబర్ 14 న ఏర్పడనుంది. ఈ రోజు సర్వ పితృ అమావాస్యతో పాటు శని అమావాస్య. దీంతో ఈ గ్రహణం అసాధారణమైన సంఘటనగా మారుతుంది. గ్రహణం సమయంలో, సూర్యుడు.. బుధుడు అధిపతి అయిన కన్యా రాశిలో ఉంటారు.. దీనిని బుధాదిత్య యోగంగా పిలుస్తారు. ఈ యోగం చాలా అసాధారణమైనది. ఇలా చివరిసారిగా 1845లో చోటు చేసుకుంది. దాదాప 178 సంవత్సరాల విరామం తర్వాత సంభవించే ఒక ప్రత్యేకమైన కలయికలో సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న సంభవించింది, ఇప్పుడు సంవత్సరంలో రెండవది మరియు చివరిది అక్టోబరు 14న ఆకాశంలో అలంకరించేందుకు సిద్ధంగా ఉంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం ఈ సూర్య గ్రహణం దాదాపు 178 సంవత్సరాల తర్వాత వచ్చే అరుదైన, అత్యంత అనుకూలమైన గ్రహణం.
సూర్యగ్రహణం 2023 సర్వపితృ అమావాస్య :
శనివారం నాడు వచ్చిన అమావాస్య కారణంగా శని అమావాస్య అని అంటారు. ఈ రోజు సూర్య గ్రహణం ఏర్పడనుంది. అంతేకాదు పితృ అమావాస్య కూడా.. ఈ కారణంగా ఈ రోజు పూర్వీకులకు చేసే పూజలు కర్మలు, ప్రార్థనలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
178 సంవత్సరాల తర్వాత అరుదైన యోగంలో సూర్య గ్రహణం
ఈ సంవత్సరం చివరిదైన సూర్య గ్రహణం అక్టోబర్ 14 న ఏర్పడనుంది. ఈ రోజు సర్వ పితృ అమావాస్యతో పాటు శని అమావాస్య. దీంతో ఈ గ్రహణం అసాధారణమైన సంఘటనగా మారుతుంది. గ్రహణం సమయంలో, సూర్యుడు.. బుధుడు అధిపతి అయిన కన్యా రాశిలో ఉంటారు.. దీనిని బుధాదిత్య యోగంగా పిలుస్తారు. ఈ యోగం చాలా అసాధారణమైనది. ఇలా చివరిసారిగా 1845లో చోటు చేసుకుంది. దాదాప 178 సంవత్సరాల విరామం తర్వాత సంభవించే ఒక ప్రత్యేకమైన కలయికలో సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
బుధాదిత్య యోగా అనేది సూర్యుడు, బుధుడు తో కలిసే ఒక శక్తివంతమైన జ్యోతిష్య కలయిక. వేద జ్యోతిషశాస్త్రంలో బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్, జ్ఞానంతో సంబంధం కలిగి ఉంటాడు. గ్రహాలకాధినేత సూర్యుడు శక్తి, నాయకత్వం, కాంతిని కలిగి ఉంటాడు. ఈ రెండు గ్రహాల కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల ఆ ఐదు రాశుల వారి జీవితంలో అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారంగా మారుతుంది.
మిధున రాశి:
మిథున రాశిలో జన్మించిన వారికి ఈ సూర్య గ్రహణం అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. కెరీర్ లో మంచి అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. సుఖ సంతోషాలతో ఇల్లు అందంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేసి ప్రశంసలను అందుకుంటారు.
సింహ రాశి
సింహరాశి వ్యక్తులు అక్టోబర్ 14న ఏర్పడనున్న సూర్యగ్రహణంతో గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపార ప్రయత్నాలలో నిమగ్నమైన వారికీ అదృష్టం కలిసి వస్తుంది. ఆర్ధికంగా మంచి పెరుగుదల ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కుటుంబ విహారయాత్ర లేదా ప్రయాణలు చేసే అవకాశం ఉంది.
తుల రాశి
ఈ రాశికి చెందిన వారికి చివరి సూర్యగ్రహణం సానుకూల ఫలితాలను తెస్తోంది. సంపద పెరుగుతుంది. ప్రతి పనులో లాభాలు లభిస్తాయి. సామాజిక గుర్తింపు లభిస్తుంది. ప్రతి ప్రయత్నంలో రాణిస్తారు. అదృష్టం మీ పక్కన ఉండి పట్టిందల్లా బంగారంగా మారుతుంది.
వృశ్చికరాశి
రేపు ఏర్పడనున్న సూర్య గ్రహాణాం వృశ్చికరాశికి చెందిన వ్యక్తులకు అత్యంత పవిత్రమైన సంఘటన. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కృషితో జీవితంలోని అన్ని అంశాలలో ఉత్తమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సహకారంతో ఆర్ధికంగా లాభాలను పొందుతారు.
మకర రాశి
ఈ రాశివారికి కూడా రేపటి సూర్యగ్రహణం 2023 ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంది. వీరి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మహిళలకు లక్ కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్, ఆస్తి లేదా వాహన పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటే ఇది శుభసమయం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.