Astrology: వృశ్చిక రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం, శుభ యోగాలు..!
ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడిని వృషభ రాశి నుంచి గురువు, కుంభ రాశి నుంచి శని ఏక కాలంలో వీక్షించడం జరుగుతోంది. గురువు, శని ప్రస్తుతం ఈ రాశుల్లో వక్ర సంచారం చేస్తూ శుక్రుడిని వీక్షించడం విశేషం. శుక్రుడిని ఈ రెండు గ్రహాలు వీక్షించడం వల్ల ఎక్కువగా శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి, శుభ వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడిని వృషభ రాశి నుంచి గురువు, కుంభ రాశి నుంచి శని ఏక కాలంలో వీక్షించడం జరుగుతోంది. గురువు, శని ప్రస్తుతం ఈ రాశుల్లో వక్ర సంచారం చేస్తూ శుక్రుడిని వీక్షించడం విశేషం. శుక్రుడిని ఈ రెండు గ్రహాలు వీక్షించడం వల్ల ఎక్కువగా శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి, శుభ వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 6వ తేదీ వరకు ఈ శుభ యోగాలు కొనసాగుతాయి. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర, కుంభ రాశుల వారికి ఈ వీక్షణ శుభ యోగాలనిచ్చే అవకాశం ఉంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడి మీద గురు, శుక్రుల దృష్టి పడడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంటుంది. మంచి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంటుంది. జీవనశైలి మరింత మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి సమూలంగా మారిపోతుంది. అనేక విధాలుగా సంపద పెరుగుతుంది. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు, ఒప్పందాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న శుక్రుడి మీద గురు, శనుల దృష్టి పడినందువల్ల సమాజంలో రాజపూజ్యాలు పెరుగుతాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభ వార్త వింటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రయత్నాలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి.
- సింహం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో ఉండి దిగ్బల యోగాన్నిస్తున్న శుక్రుడి మీద శని, గురువుల శుభ దృష్టి పడినందువల్ల ఈ రాశివారికి ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారమై అత్యంత విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తుల విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. ఆస్తులు కొనే అవకాశం కూడా ఉంది. గృహ, వాహన యోగాలు ఏర్పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది.
- వృశ్చికం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడిని సప్తమ స్థానం నుంచి గురువు, చతుర్థ స్థానం నుంచి శని వీక్షించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడంతో పాటు వేతన వృద్ధికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా ఆర్థిక సమస్యలను, ఒత్తిళ్లను అధిగమించే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు మెరుగైన ఫలితాలనిస్తాయి.
- మకరం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న శుక్రుడి మీద రాశ్యధిపతి శనితో పాటు పంచమంలో ఉన్న గురుడి దృష్టి పడడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన లాభం ఉంటుంది. నిరుద్యోగులకు అనేక కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందడం జరుగుతుంది.
- కుంభం: దశమ స్థానంలో ఉన్న శుక్రుడి మీద రాశ్యధిపతి శని, ధనాధిపతి గురువు దృష్టి పడడం వల్ల ఆదాయ వృద్ధి కోసం ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. రావలసిన డబ్బు, బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదా యంతో పాటు ఆరోగ్యానికి కూడా లోటుండదు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి