AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn Retrograde: తిరోగమనంలో శనీశ్వరుడు.. 15 నవంబర్ నుంచి కొన్ని రాశులకు అదృష్టం.. కొన్ని రాశులకు కష్టాలు..

నవగ్రహాలలో ఒకరైన శనీశ్వరుడు త్వరలో కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారు విశేష ప్రయోజనాలను పొందొచ్చు, అయితే కొన్ని రాశుల వారు ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పంచాంగం ప్రకారం శనీశ్వరుడు ఎప్పుడు తిరోగమనం చేయనున్నాడు. ఏ రాశులకు చెందిన వ్యక్తులకు ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వనున్నాడు. ఈ రోజు తెలుసుకుందాం..

Saturn Retrograde: తిరోగమనంలో శనీశ్వరుడు.. 15 నవంబర్ నుంచి కొన్ని రాశులకు అదృష్టం.. కొన్ని రాశులకు కష్టాలు..
Lord Shani Dev
Surya Kala
|

Updated on: Oct 17, 2024 | 9:31 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడు ముఖ్యమైన గ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతున్నాడు. శనీశ్వరుడు చాలా నెమ్మదిగా కదిలే గ్రహంగా చెబుతారు. ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు. ఆ తర్వాత శనీశ్వరుడు ఆ రాశిలోకి మళ్ళీ రావడానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. శనీశ్వరుడు కర్మ ఫలితాలను ఇచ్చేవాడు. జూన్ నెలలో శనిదేవుడు తిరోగమనంలో ఉన్నాడు .. నవంబర్ నెలలో నేరుగా సంచరించనున్నాడు. ఈ సమయంలో శనీశ్వరుడు తన రాశిచక్రం కుంభరాశిలో సరళ దిశలో కదలడం ప్రారంభిస్తాడు. శనీశ్వరుడు ప్రత్యక్ష కదలిక వలన అనేక రాశికి చెందిన వ్యక్తులకు ఒక వరం అని అంటున్నారు జ్యోతిష్కులు. ఇందులో వృత్తి, వ్యాపారంలో పురోగతితో పాటు కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు సంతోషమైన వ్యక్తిగత జీవితాన్ని కూడా కలిగి ఉంటారు.

శనీశ్వరుడు ఎప్పుడు సంచరించనున్నాడంటే

పంచాంగం ప్రకారం శనీశ్వరుడు జూన్ 30 నుంచి తాను అధిపతి అయిన కుంభ రాశిలోకి తిరోగమనం వైపు కదులుతున్నాడు. ఆ తర్వాత నవంబర్ 15 రాత్రి 7:51 గంటలకు శనీశ్వరుడు నేరుగా కుంభరాశిలో అడుగు పెట్టి సంచరించానున్నాడు.

ఇవి కూడా చదవండి

ఏ రాశి వారికి శుభం అంటే

మేష రాశి : శనీశ్వరుడు ప్రత్యక్ష సంచారం మేష రాశి వారికి శుభసూచకాలను తెస్తోంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు గొప్ప విజయాన్ని సాధిస్తారు. వృత్తిలో ఎదుగుదల ఉంటుంది. అంతేకాదు వ్యక్తిగత జీవితం, ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు నవంబర్ 15 తర్వాత కాలం అద్భుతంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి, అంతే కాకుండా వీరు మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందుతారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. పరస్పర విభేదాలు తొలగిపోతాయి.

మకరరాశి: శనీశ్వరుడు ప్రత్యక్ష సంచారం మకర రాశి వారికి శుభసూచకాలను తెస్తోంది. ఈ కాలంలో వీరు ఆర్థిక, పెట్టుబడి ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కూడా విజయం సాధిస్తారు. అయితే ఆర్థిక పురోగతిని చేపట్టిన పనుల్లో అభివృద్ధిని సాధించడానికి కొంచెం అధికంగా కష్టపడవలసి ఉంటుంది.

ఎవరికి సమస్యలు పెరుగుతాయంటే

శనీశ్వరుడు కుంభ రాశిలో సంచరించే సమయంలో వృషభం, మిథునం, కర్కాటకం రాశి వారికి సమస్యలు పెరుగుతాయి. ఈ రాశుల వారికి ఆస్తి, అత్తమామలతో సంబంధాలపై ప్రభావం చూపనుంది. అంతేకాదు అనేక ఇతర సంఘటనలు ప్రభావితం అయ్యి చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)