Lucky Horoscope: రవి, కుజుల గ్రహ సంచార ప్రభావం.. ఆ రాశుల వారికి అత్యధిక ప్రయోజనం..!
Telugu Astrology: ఈ నెల 21 నుంచి కుజుడు కర్కాటక రాశిలో నీచబడడం జరుగుతుంది. ఇప్పటికే రవి తులా రాశిలో నీచత్వం పొందడం జరిగింది. నవంబర్ 16 వరకు ఈ రెండు పాప గ్రహాల నీచత్వం కొనసాగుతుంది. అధికారానికి, నాయకత్వానికి సంబంధించిన ఈ రెండు గ్రహాలు నీచ స్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా ఉపయోగం కలుగుతుంది.
ఈ నెల 21 నుంచి కుజుడు కర్కాటక రాశిలో నీచబడడం జరుగుతుంది. ఇప్పటికే రవి తులా రాశిలో నీచత్వం పొందడం జరిగింది. నవంబర్ 16 వరకు ఈ రెండు పాప గ్రహాల నీచత్వం కొనసాగుతుంది. అధికారానికి, నాయకత్వానికి సంబంధించిన ఈ రెండు గ్రహాలు నీచ స్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా ఉపయోగం కలుగుతుంది. ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగులు, స్వయం ఉపాధికి చెందిన వారికి పురోగతి ఉంటుంది. భూ లాభాలు కలుగు తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ రెండు గ్రహాలు నీచబడడం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు అత్యధికంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో కుజుడు, సప్తమ కేంద్రంలో రవి నీచబడడం వల్ల నీచభంగం జరిగి, ఈ రెండు గ్రహాలు శుభ ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాల్లోని ఆటంకాలు తొలగి పోయి, అదనపు ఆదాయానికి మార్గం సుగమం అవుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రభుత్వం రావలసిన డబ్బు, గుర్తింపు లభిస్తాయి. తండ్రి నుంచి వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. కోర్టు కేసులు చాలావరకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.
- వృషభం: ఈ రాశికి మూడవ స్థానంలో కుజుడు, ఆరవ స్థానంలో రవి నీచబడడం వల్ల కొద్ది ప్రయత్నంతో అధికంగా లాభాలు పొందుతారు. ఏ ప్రయత్నమైనా నెరవేరుతుంది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధ మైన ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలుం టాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. మన సులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
- కర్కాటకం: ఈ రాశిలో కుజుడు, చతుర్థ స్థానంలో రవి నీచబడడం వల్ల ఈ రాశివారికి అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. భూ లాభాలు కలుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతానికి స్థాన చలనం ఉంటుంది. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అధికారం లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా కొనసాగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు, ఇతర సమస్యలు సానుకూలంగా పరిష్కారమై సంపద పెరుగుతుంది.
- తుల: ఈ రాశిలో రవి, దశమ స్థానంలో కుజుడు నీచపడడం వల్ల మరింత మంచి ఉద్యోగంలోకి మార డానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించి, విదేశీ సంబంధం నిశ్చయం అవుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పెద్ద ఎత్తున భూ లాభాలు కలుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో రవి, అష్టమ స్థానంలో కుజుడు నీచబడినందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. జీవిత భాగస్వామికి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ధన లాభం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లేదా సంపద లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో సానుకూలతలు ఏర్పడే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశికి ఆరవ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి నీచబడడం వల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతికి, వేతనాలు పెరుగుదలకు అవకాశం ఉంది. అయితే, మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందుతుంది. ఆదాయం అనేక వైపుల నుంచి వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.