తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశిలో బుధుడు, ధన స్థానంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం వల్ల ఆదాయానికి లోటుండక పోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. శుక్ర, బుధుల వల్ల కొన్ని శుభ పరిణా మాలు కూడా చోటు చేసుకుంటాయి. ఆర్థికంగానే కాక, ఉద్యోగపరంగా కూడా వారమంతా అను కూలంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. విద్యా ర్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.