Zodiac Signs: అనుకూల స్థానంలో శుక్ర గ్రహం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు పక్కా..!
ఈ నెల 27వ తేదీ నుంచి పూర్వాభాద్ర నక్షత్రంలో, అంటే గురువు నక్షత్రంలో ప్రవేశిస్తున్న శుక్ర గ్రహం వల్ల అనేక శుభ యోగాలు, సుఖసంతోషాలు ఏర్పడబోతున్నాయి. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు అనేక విధాలుగా లబ్ధి పొందే అవకాశం ఉంది.
ఈ నెల 27వ తేదీ నుంచి పూర్వాభాద్ర నక్షత్రంలో, అంటే గురువు నక్షత్రంలో ప్రవేశిస్తున్న శుక్ర గ్రహం వల్ల అనేక శుభ యోగాలు, సుఖసంతోషాలు ఏర్పడబోతున్నాయి. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు అనేక విధాలుగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఏప్రిల మొదటి వారం వరకూ కొనసాగే ఈ శుక్ర సంచారంలో భాగంగా ఈ రాశుల వారు కుటుంబ, దాంపత్య, ఉద్యోగ, ఆర్థికపరంగా అనేక శుభ ఫలితాలు అనుభవించడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు శుభ గ్రహమైన గురువు నక్షత్రంలో సంచారం చేయడం వల్ల అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. జీవితాన్ని మలుపు తిప్పగల ఒకటి రెండు శుభ పరి ణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అనుకోకుండా సంపద పెరగడానికి, సంపన్నులు కావ డానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలన్నీ తొలగిపోయి, ఉత్సాహంగా కొనసా గడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది. శుభకార్యం జరిగే అవకాశముంది.
- మిథునం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా మెరుగైన జీవితం లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా మారతాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి అత్యంత శుభ నక్షత్రమైన పూర్వాభాద్రలో శుక్ర సంచారం జరగడం ఒకటి రెండు విషయాల్లో ఈ రాశివారి జీవితాన్నే మార్చేస్తుంది. కెరీర్ పరంగా, ఆదాయపరంగా ఈ రాశివారి జీవితం అందలాలు ఎక్కుతారు. ఈ రాశివారికి రాజయోగం పట్టే సూచనలున్నాయి. నిధుల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో మంచి లాభాలు అనుభవిస్తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
- కన్య: ఈ రాశివారికి శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులకు, జీత భత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది., వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. ఈ రాశివారికి తప్పకుండా మహాభాగ్య యోగం పడుతుంది. సంతాన యోగం కలగడానికి కూడా అవకాశముంది. కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఏదో రూపేణా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించి ఊరట చెందుతారు.
- తుల: ఈ రాశినాథుడైన శుక్రుడు బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల అనుకోని సమయంలో అనుకోని విధంగా ఆదాయం అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు తేలి కగా, సునాయాసంగా విజయవంతం అవుతాయి. ఆదాయానికే కాక, ఆరోగ్యానికి కూడా ఇబ్బంది ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. సర్వత్రా గౌరవమర్యాదలు ఇను మడిస్తాయి. కొత్త ఇల్లు గానీ, కొత్త వాహనం గానీ కొనడం జరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
- ధనుస్సు: గురువు ఈ రాశికి అధిపతి అయినందువల్ల, పూర్వాభాద్ర గురు నక్షత్రం అయినందువల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అత్యధిక లాభాలను, ఆదాయాన్ని చవి చూడడం జరుగు తుంది. అనేక విధాలుగా కలిసి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవు తాయి. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
- కుంభం: ఈ రాశివారికి ధన స్థానాధిపతి అయిన గురువు నక్షత్రంలో శుక్రుడి సంచారం వల్ల అనేక విధా లుగా ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తు లతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు కలుగు తాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఆస్తి కలిసి రావడం, ఆస్తి విలువ పెరగడం జరుగుతుంది.