Luck Astrology: అనుకూలంగా భాగ్యాధిపతి.. ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ భాగ్య స్థానాధిపతి, అంటే 9వ స్థానాధిపతి అనుకూలంగా ఉంటే జీవితం అన్ని విధాలుగానూ అనుకూలంగా సాగిపోతుంది. ఎన్ని సమస్యలైనా, కష్టాలైనా మబ్బుల్లా విడిపోతాయి. ఏలిన్నాటి శని, కుజ దోషం, రాహు దోషం వంటివి కూడా హరించుకుపోతాయి. ప్రస్తుతం గోచారంలో..

Luck Astrology: అనుకూలంగా భాగ్యాధిపతి.. ఆ రాశుల వారికి అదృష్టమే అదృష్టం!
Luck Horoscope 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 25, 2024 | 6:12 PM

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ భాగ్య స్థానాధిపతి, అంటే 9వ స్థానాధిపతి అనుకూలంగా ఉంటే జీవితం అన్ని విధాలుగానూ అనుకూలంగా సాగిపోతుంది. ఎన్ని సమస్యలైనా, కష్టాలైనా మబ్బుల్లా విడిపోతాయి. ఏలిన్నాటి శని, కుజ దోషం, రాహు దోషం వంటివి కూడా హరించుకుపోతాయి. ప్రస్తుతం గోచారంలో మేషం, వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, కుంభ రాశుల వారికి భాగ్యాధిపతి అనుకూల సంచారం చేస్తున్నాడు. ఫలితంగా ఈ రాశుల వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. అదృష్టం పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. ధన యోగాలు పడతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

  1. మేషం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా డబ్బు కలిసి వస్తుంది. తప్పకుండా సంపద పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి భంగమేమీ ఉండదు. అనారోగ్యాలు ఏవైనా ఉంటే వాటి నుంచి కోలుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఏదో విధంగా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
  2. వృషభం: ఈ రాశికి భాగ్యాధిపతి, అత్యంత శుభుడు అయిన శనీశ్వరుడు ఉద్యోగం స్థానంలో బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి సంపద బాగా పెరుగుతుంది. ఆస్తి కలిసి రావడం, ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం వంటివి జరుగుతాయి. తండ్రి నుంచి సంపద రావడంతో పాటు, ఆర్థికంగా సహాయ సహాకారాలు అందుతాయి. విదేశీ సొమ్ము తినే యోగం కూడా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  3. మిథునం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు భాగ్య స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల, అనేక విధాలుగా సంపద కలిసి వస్తుంది. పితృ సంబంధమైన ఆస్తి కలిసి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం రావడం, ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు అన్ని విధాలుగానూ స్థిరపడడం వంటివి జరుగుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. అనేక శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు బాగా పెరుగుతాయి.
  4. సింహం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన కుజుడు సప్తమ రాశిలోనే ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల ద్వారా ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడానికి, అదనపు రాబడికి, పదోన్నతులకు అవకాశముంటుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. తండ్రి నుంచి సహాయం అందుతుంది. జీవిత భాగస్వామికి కూడా ఆర్థికంగా అదృష్టం పడుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన 4వ రాశిలో, రవి తన మిత్రక్షేత్రమైన మీన రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టం పడుతుంది. ఏ పని తలపెట్టినా కలసి వస్తుంది. ఆదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనం తగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. అధికారయోగం పడు తుంది. తల్లి వైపు నుంచి ఆస్తి గానీ, సంపద గానీ కలిసి వస్తుంది. ఆరోగ్య భాగ్యం కూడా ఉంటుంది.
  6. కుంభం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల మరో రెండు నెలల పాటు వీరికి ఏదో విధంగా అదృష్టం కలిసి వస్తుంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తేలికగా పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.