దిన ఫలాలు: వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 26, 2024): మేష రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వృషభ రాశి వారికి కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు: వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
Horoscope Today 26th March 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 26, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మార్చి 26, 2024): మేష రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వృషభ రాశి వారికి కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ప్రయాణాల వల్ల బాగా లాభం కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలకు అవకాశముంది. బంధువులతో మాట పట్టింపులుంటే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ లాభాలకు కొరత ఉండదు. ఉద్యోగంలో అధికారులతో బాధ్యతలు పంచుకుంటారు. ఇతరుల వ్యవహారాల్లో మీరు తలదూర్చకపోవడం మంచిది. ఆదాయం బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

గృహ రుణానికి సంబంధించి ఒప్పందం ఖరారు చేసుకుంటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశముంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశముంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొందరు బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాల్లోనూ, కీలక సమయాల్లోనూ మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమై, ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశముంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. సరికొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వచ్చే సూచనలున్నాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కొన్ని మాత్రమే పూర్తవు తాయి. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపోతుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ముఖ్య మైన అవసరాలు తీరిపోతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంటా బయటా కాస్తంత జాగ్ర త్తగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులు ఆశించిన విధంగాద శుభ వార్తలు వినే సూచనలు న్నాయి. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. మీకు ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కొందరు బంధువులతో అకారణంగా వివాదాలు తలెత్తే అవకాశముంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యలుం టాయి. అయితే, లాభాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పొందుతారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగి పోతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్త వుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు వరిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. అనుకోకుండా కొద్దిపాటి ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. లాభాలకు ఏమాత్రం లోటుండదు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు అంది వస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. అప్రయత్న ధన లాభం కూడా ఉంటుంది. ఉద్యో గాల్లో పదోన్నతులకు అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యో గులకు ఆశించిన కంపెనీలో కోరుకున్న ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. వాహన యోగం పడు తుంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటవుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశిం చిన లాభాలు పొందుతారు. కొత్త ప్రయత్నాలకు, కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. అధికారులు మీపై ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపోయి లాభాలు పండిస్తాయి. సోదరు లతో వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు లేదా పత్రాలు పోయే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వస్త్రాభరణాలు కొనడం జరుగు తుంది. ఇంట్లో సౌకర్యాలను మెరుగుపరచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రత్యేకమైన గుర్తింపు లభించి, ఆశించిన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశ ముంది. ఉద్యోగంలో అనుకోకుండా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన ఆలయాల దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం, దాంపత్య జీవితం బాగా మెరుగ్గా కొనసాగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సన్నిహితుల ద్వారా శుభవార్తలు వినడం, ఆర్థికంగా లాభపడడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదం నుంచి అనుకోకుండా బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా, ఉత్సాహంగా సాగి పోతాయి. ఇంటా బయటా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశముంది. ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగానే సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కొందరు సన్నిహితులతో అపార్థాలు తలెత్తుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, దాంతో పాటే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

రెండో సినిమాతోనే పాన్ ఇండియా ఛాన్స్..
రెండో సినిమాతోనే పాన్ ఇండియా ఛాన్స్..
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు రెచ్చిపోతున్నారుః మస్క్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
కాన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్‌లను అరెస్ట్ చేసిన డీఎస్పీ సిరాజ్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
డేంజర్ బెల్స్.. చైనాలో మరో మహమ్మారి.. భారత్ అలర్ట్
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్