Shukra Gochar 2024: మీన రాశిలోకి శుక్రుడు.. మాలవ్య యోగంతో ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం

ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు శుక్రుడు మీన రాశిలో సంచారం చేయబోతున్నాడు. శుక్ర గ్రహానికి మీన రాశి ఉచ్ఛ స్థానం. శుక్రుడు ఉచ్ఛ స్థానంలో ప్రవేశించినప్పుడు , అది ఏ రాశికైనా కేంద్ర స్థానం అయినప్పుడు మాలవ్య మహాపురుష యోగం పడుతుంది. అంటే, మార్చి 30న శుక్రుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు..

Shukra Gochar 2024: మీన రాశిలోకి శుక్రుడు.. మాలవ్య యోగంతో ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం
Goddess Lakshmi
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 26, 2024 | 7:01 PM

ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 24 వరకు శుక్రుడు మీన రాశిలో సంచారం చేయబోతున్నాడు. శుక్ర గ్రహానికి మీన రాశి ఉచ్ఛ స్థానం. శుక్రుడు ఉచ్ఛ స్థానంలో ప్రవేశించినప్పుడు , అది ఏ రాశికైనా కేంద్ర స్థానం అయినప్పుడు మాలవ్య మహాపురుష యోగం పడుతుంది. అంటే, మార్చి 30న శుక్రుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు మాలవ్య మహాపురుష యోగమనే అరుదైన లక్ష్మీ యోగం పడుతుంది. ఈ నాలుగు రాశులు కాక, వృషభ, తులా రాశులకు శుక్రుడే రాశ్యధిపతి అయినందువల్ల ఈ రెండు రాశులకు కూడా మహా లక్ష్మీయోగం ఏర్పడుతోంది. ఈ ఆరు రాశులకు దాదాపు నెల రోజుల పాటు తప్పకుండా దశ తిరుగుతుంది. లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలు లభిస్తాయి.

  1. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల మూడు నాలుగు వారా లపాటు వీరికి ఆర్థికంగా తిరుగుండదు. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలుగానూ ప్రాభవం పెరుగుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఏ రంగానికి చెందినవారికైనా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తిరుగులేని పురోగతి ఉంటుంది.
  2. మిథునం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. నిరుద్యోగు లకే కాక, ఉద్యోగులకు సైతం విదేశాల నుంచి కూడా ఆఫర్లు అంది వస్తాయి. జీవితాన్ని మలుపు తిప్పే శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెండింగులో ఉన్న శుభ కార్యాలన్నీ పూర్తవు తాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఏర్పడుతుంది.
  3. కన్య: ఈ రాశికి సప్తమ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల, మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల తప్పకుండా విదేశీయాన యోగం పడుతుంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది. నిరుపేదకు సైతం సంపన్న భాగ్యం కలుగుతుంది. ఆర్థికంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎదుగుదల ఉంటుంది. సంపన్న వ్యక్తులతో ప్రేమలో పడడం, సంపన్న వ్యక్తులతో పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఏర్పడుతుంది.
  4. తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛపడుతున్నందు వల్ల వీరికి వృత్తి, ఉద్యోగాల పరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కూడా పోటీదార్లు బాగా వెనక్కు తగ్గుతారు. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగం పడుతుంది. నిరుద్యోగులకు ఏమాత్రం ఊహించని సంస్థల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆర్థిక సంబంధమైన, భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్నవారు అపర కుబేరులవుతారు.
  5. ధనుస్సు: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల, ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల ఈ రాశివారికి తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. తల్లి వైపు నుంచి ఆస్తి వస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
  6. మీనం: ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల, ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. ఫలితంగా ఈ రాశివారికి అనేక విధాలుగా ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికార లాభం కలుగుతుంది. ఆర్థికంగా విశే షంగా కలిసి వస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వారితో ప్రేమలో పడడం, పెళ్లి సంబంధం కుదరడం వంటివి జరుగుతాయి. మాటకు, చేతకు తిరుగుండదు.