దిన ఫలాలు (మార్చి 27, 2024): వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (మార్చి 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మార్చి 27, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగానే సాగిపోతాయి. ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఉండవచ్చు. తోబుట్టువులతో మాట పట్టిం పులు ఏర్పడే అవకాశముంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందే అవకాశముంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు వింటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహన యోగం పడుతుంది. బంధుమిత్రులు సహాయంగా ఉంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పరుగులు పెడతాయి. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దాదాపు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీకు రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపో తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థికంగా బాగా పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి పెళ్లికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొందరు నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మీకు ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆర్థికంగా ఫలితం ఉంటుంది. ఉద్యోగాల్లో పనిభారం, బరువు బాధ్యతలు పెరిగే అవకాశముంది. కొందరు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఊహించని ఖర్చులు కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశముంది. కొత్త ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలం అయి లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగు తాయి. నిరుద్యోగులకు తప్పకుండా శుభవార్తలు అందుతాయి. రావనుకుని ఆశలు వదిలేసు కున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయాల్సి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసి రాకపోవచ్చు. కొందరు స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి.
తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)
స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. ఉద్యోగంలో పని భారానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
కుటుంబ సభ్యుల నుంచి మీకు శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా ఈ రోజు అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో మాట చెలామణీ ఉంటుంది. నిరుద్యో గులకు మంచి అవకాశాలు అంది వచ్చే అవకాశముంది. దాంపత్య జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సామాజికంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఇతరుల వివాదాల్లో మధ్యవర్తిత్వం నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులకు, సాటి ఉద్యోగులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశముంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని భారం ఉన్నా ఫలితం ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులు, ఉద్యోగంలో అధికారులు మీ సలహాలకు విలువనిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో గానీ పూర్తి కావు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, ఒకరిద్దరికి సహాయం చేయాల్సి వస్తుంది. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, లాభదాయ కంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా మీరు ఆశించిన విధంగా గడిచిపోతుంది. బంధువుల రాకపోకలుంటాయి. ఇష్టమైన ఆల యాలను సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నా లకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.