దిన ఫలాలు(మార్చి 28, 2024): వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 28, 2024): మేష రాశి వారు ఈ రోజు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వృషభ రాశి వారు ఆస్తి కొనుగోలుకు సంబంధించి శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

దిన ఫలాలు(మార్చి 28, 2024): వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు..12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 28th March 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 28, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మార్చి 28, 2024): మేష రాశి వారు ఈ రోజు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. వృషభ రాశి వారు ఆస్తి కొనుగోలుకు సంబంధించి శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేయడం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలకు ఆటంకాలు తప్పకపో వచ్చు. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగపరంగా అను కూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజన కంగా ముందుకు సాగుతాయి.ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆదాయం మరింతగా పెరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం కలుగుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కొనుగోలుకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొదవ ఉండదు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అంది వస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు బాగా మెరుగ్గా సాగిపోతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే విషయం ఆలోచిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యలు పరిష్కారమైపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కొందరు బంధుమిత్రులతో అకారణ వైరాలకు అవకాశం ఉంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాలు, ప్రయాణాల కారణంగా శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోతారు. అంచనాలకు మించిన రాబడి అందుతుంది. ఉద్యోగంలో ఎక్కువగా ఉప యోగించుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా విలాసాల మీద ఖర్చు ఎక్కువయ్యే అవకాశముంది. పొదుపు చర్యలు పాటించడం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. కుటుంబంతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపో తాయి. ఉద్యోగంలో అధికారులకు అండగా ఉంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలపరంగా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి అండ దండలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. కుటుంబంతో ఆలయాలు సందర్శి స్తారు. కొత్త ఆదాయ మార్గాలు అంది వస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహం కలిగిస్తుంది. ఆర్థిక పరంగా కొత్త ప్రయత్నాలు చేపడతారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపో తాయి. ఉద్యోగంలో ప్రాభవం, ప్రాబల్యం పెరుగుతాయి. నిరుద్యోగులు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించే అవకాశముంది. అనుకోకుండా పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు లభిస్తాయి. కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ప్రయాణాల్లో ఆర్థిక లాభం కలుగుతుంది. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. కుటుంబ సమస్యల తోడ్పాటుతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. చేప ట్టిన పనులు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని దైవకార్యాల్లో పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

విదేశాల్లో స్థిరపడిన కొందరు దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశముంది. ఉద్యోగంలో మీ ప్రాభవం బాగా పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడతారు. అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. నిరు ద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితా లనిస్తాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా దూరం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పొందడం జరుగుతుంది. ప్రతి పనిలోనూ తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారతాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభించడం, పదోన్నతికి అవకాశాలు మెరుగుపడడం వంటివి జరుగుతాయి. ఇంటా బయటా సఖ్యతతో వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లువెత్తుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఎంతో శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొందరు బంధుమిత్రులతో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కష్టానికి, పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన బాధ్యతలు పెరుగుతాయి. ప్రస్తుతానికి ఎవరికీ ఆర్థిక సహాయం చేయవద్దు. ఆర్థిక లావాదేవీలు కూడా పెట్టుకోవద్దు. ఉద్యోగ జీవితం సానుకూ లంగా, సామరస్యంగా సాగిపోతుంది. కొందరు ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో