Zodiac Signs: మేష రాశిలో గురు, బుధ గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 9 వరకూ బుధ గ్రహం మేషంలో సంచారం చేయబోతోంది. మేష రాశిలో అది గురు గ్రహంతో కలవడం వల్ల ఒక కొత్త అభీష్ట సిద్ధి యోగం ఏర్పడుతోంది. అంటే, వృత్తి, ఉద్యోగాల్లో అధికారం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, విదేశాల్లో ఉద్యోగాలు, సంతాన యోగం, ఆర్థికాభివృద్ధి వంటి విషయాల్లో మనసులో ఉన్న కోరికలు నెరవేరడం జరుగుతుంది.
ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 9 వరకూ బుధ గ్రహం మేషంలో సంచారం చేయబోతోంది. మేష రాశిలో అది గురు గ్రహంతో కలవడం వల్ల ఒక కొత్త అభీష్ట సిద్ధి యోగం ఏర్పడుతోంది. అంటే, వృత్తి, ఉద్యోగాల్లో అధికారం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు, విదేశాల్లో ఉద్యోగాలు, సంతాన యోగం, ఆర్థికాభివృద్ధి వంటి విషయాల్లో మనసులో ఉన్న కోరికలు నెరవేరడం జరుగుతుంది. బుధ, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్న మేషం, మిథునం, సింహం, తుల, థనుస్సు, మీన రాశులకు ఇది పూర్తి స్థాయి శుభ ఫలితాలనిస్తుంది.
- మేషం: సహజ శుభ గ్రహాలైన బుధ, గురువులు ఈ రాశిలో కలుస్తున్నందువల్ల ఈ రాశివారు తప్ప కుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. మేష రాశిలో ఉన్న బుధుడు సత్వర ఫలితాలనిస్తాడు. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి, అభివృద్ధి ఉంటాయి. అనేక విధాలుగా సంపద పెరుగు తుంది. జీవితంలో ఏదో విధంగా పైకి రావాలన్న తపన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలను చాలా వరకు తగ్గించుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది.
- మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు లాభ స్థానంలో ప్రవేశించడం, పైగా మరో శుభ గ్రహమైన గురువుతో కలవడం వల్ల ఈ రాశివారు శుభ ఫలితాలను లేదా శుభ యోగాలను ఎక్కువగా అనుభవించడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అనేక విధాలుగా పలుకుబడి పెరుగుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఊహించని సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు ఎదగడం జరుగుతుంది.
- సింహం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో బుధ, గురు గ్రహాలు కలవడం అనేక విధాలుగా లాభాలు చేకూరు స్తుంది. అనేక శుభయోగాలు కలగజేస్తుంది. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధిం చిన ఆటంకాలు తొలగిపోతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. విద్యార్థులకు కూడా విదేశీ విద్యకు అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆస్తి వివాదం, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
- తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో రెండు శుభ గ్రహాలు కలవడం అనేది అనేక విధాలుగా యోగదాయకం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సునా యాసంగా నెరవేరుతాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి సంబంధం కుదరడం గానీ జరుగుతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి.
- ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ, గురువుల కలవడం వల్ల ఒక విధమైన రాజయోగం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. ఈ రెండు గ్రహాలు కలవడమనేది అధికార యోగాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగు తుంది. పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.
- మీనం: ఈ రాశికి ధన స్థానంలో ఈ రెండు శుభ గ్రహాలు కలవడం అనేది ఒక గొప్ప విశేషం. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలను అధికారులు గౌరవిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థానాలు లభిస్తాయి. పుణ్య క్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.