Lord Shani Dev: ఈ రాశుల వారికి శని దోషం.. ఈ చిన్న పరిహారాలతో ఆర్థిక, ఉద్యోగ పరంగా అన్ని శుభాలే..!
ప్రస్తుతం కుంభ రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు 2025 వరకు ఇదే రాశిలో కొనసాగుతాడు. శనికి ఇది స్వస్థానం అయినందువల్ల కొన్ని రాశులకు అధిక బలంతో యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల శని మిగిలిన రాశులకు తక్కువ స్థాయిలోనే కష్టనష్టాలను ఇవ్వడం జరుగుతుంది.
ప్రస్తుతం కుంభ రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు 2025 వరకు ఇదే రాశిలో కొనసాగుతాడు. శనికి ఇది స్వస్థానం అయినందువల్ల కొన్ని రాశులకు అధిక బలంతో యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల శని మిగిలిన రాశులకు తక్కువ స్థాయిలోనే కష్టనష్టాలను ఇవ్వడం జరుగుతుంది. శని దోషం ఉన్న కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశులను కూడా శని ఆర్థికంగా, ఉద్యోగపరంగా కరుణించడం జరుగుతుంటుంది. శనీశ్వరుడు సహజ పాపి అయినందువల్ల శని దోషం ఉన్నవారిని కొద్దిగానైనా ఇబ్బంది పెట్టకుండా ఉండడు. శనికి కొద్దిపాటి పరిహారం చేయగలిగితే శని దోషాలు దాదాపు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న శని వల్ల అష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతుంటాయి. స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. మానసిక ఒత్తిడి కూడా తోడవుతుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలన్న పక్షంలో ఈ రాశివారు తరచూ శివార్చన చేయించడం మంచిది. విష్ణు సహస్ర నామ పఠనం కూడా శని దోషాన్ని చాలావరకు పరిహరి స్తుంది.
- సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఏ పనీ సవ్యంగా పూర్తి కాదు. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. మధ్య మధ్య అనారోగ్యాలు బాధిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఎదుగూ బొదుగూ ఉండదు. పని భారం ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి కూడా ఉండదు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలన్న పక్షంలో ఏదైనా గుడిలో చిన్నపాటి అన్నదానం చేయించడం లేదా ఎక్కువగా నల్ల రంగు దుస్తులు ధరించడం మంచిది.
- వృశ్చికం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఏర్పడింది. దీని వల్ల సుఖ నాశనం జరుగుతుంది. ఏ పనిలోనూ మనసు లగ్నం కాదు. విద్యార్థులకు కూడా చదువుల పట్ల శ్రద్ధాసక్తులు తగ్గుతాయి. గృహ, వాహన సమస్యలుంటాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరినో ఒకరిని అనారోగ్యం బాధిస్తూ ఉంటుంది. తానొకటి తలచిన దైవమొకటి తలచును అన్నట్టుగా ఉంటుంది. వీటి నుంచి బయటపడేందుకు ఇంట్లో తరచూ శివార్చన లేదా అభిషేకం జరిపించడం మంచిది.
- మకరం: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి దోషం ఏర్పడింది. దీని ఫలితంగా, రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయం కనిపిస్తూ ఉంటుంది కానీ, చేతికి అందక ఇబ్బంది పడతారు. శుభ కార్యాలు పెండింగులో పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక పట్టాన ఫలితమివ్వవు. వీటి నుంచి బయటపడేందుకు తరచూ శివాలయాన్ని సందర్శించాలి. వీలైనప్పుడల్లా నల్ల దుస్తులు ధరించాలి.
- కుంభం: ఈ రాశిలో శనీశ్వరుడి సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. ఎవరికీ చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఒత్తిడికి గురవుతుంటారు. ఏ పనీ ఒక పట్టాన కలిసి రాదు. సహాయం పొందినవారు అవసర సమయాల్లో ముఖం చాటేస్తుంటారు. తరచూ అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. మిత్రులు శత్రువులుగా మారుతారు. శివార్చన చేయించడం, శని స్తోత్రాన్ని చదువుకోవడం వంటివి ఈ శని దోషానికి విరుగుడుగా పని చేస్తాయి.
- మీనం: ఈ రాశికి 12వ రాశిలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. దీనివల్ల, కష్టార్జి తమంతా ఏదో విధంగా వృధా అయిపోతుంటుంది. వైద్య ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనవసర చాకిరీ పెరుగుతుంది. రహస్య శత్రువులు తయారవుతారు. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. మంచి చెప్పినా చెడుగా మారుతుంది. ఈ దోష పరిహారానికి తరచూ నల్ల దుస్తులు ధరించడం మంచిది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల దోష పరిహారం జరుగుతుంది.