Rahu Gochar 2024: మీనరాశిలో రాహువు.. ఈ పరిహారాలతో ఆ రాశుల వారికి శుభ ఫలితాలు..!
చంద్ర గ్రహణం తర్వాత నుంచి రాహువుకు బలం పెరగబోతోంది. 2025 ఏప్రిల్ వరకు మీన రాశిలో సంచరించబోతున్న రాహువు మరింత తీవ్ర స్థాయిలో సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభ, మీన రాశుల వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. అసలే తన శత్రు క్షేత్రమైన మీన రాశిలో ఉన్న రాహువు ఈ రాశుల వారికి ఒక పెద్ద విలన్ గా మారే సూచనలున్నాయి.
చంద్ర గ్రహణం తర్వాత నుంచి రాహువుకు బలం పెరగబోతోంది. 2025 ఏప్రిల్ వరకు మీన రాశిలో సంచరించబోతున్న రాహువు మరింత తీవ్ర స్థాయిలో సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభ, మీన రాశుల వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. అసలే తన శత్రు క్షేత్రమైన మీన రాశిలో ఉన్న రాహువు ఈ రాశుల వారికి ఒక పెద్ద విలన్ గా మారే సూచనలున్నాయి. జ్యోతిష శాస్త్రం రాహువును కపట రాహువుగానే అభివర్ణించడం జరిగింది. ఈ రాశులకు రాహువు వల్ల అధికార యోగాలు, ధన యోగాలు కలగాలన్న పక్షంలో ఈ గ్రహానికి కొద్దిపాటి శాంతి జరిపించాల్సి ఉంటుంది.
- సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు ధన నష్టం కలిగించడానికి, అనారోగ్య బాధ కలిగించడానికి అవకాశముంది. ఏ ప్రయత్నం తలపెట్టినా చివరి క్షణంలో బెడిసి కొట్టడం కూడా జరుగుతుంది. రాహువు ఈ రాశివారికి ఇటువంటి సమస్యలు సృష్టించకుండా ఉండా లన్నా, ధన యోగం కలగజేయాలన్నా ఈ రాశివారు తప్పకుండా దుర్గా స్తోత్రం లేదా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది. దీనివల్ల రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
- కన్య: ఈ రాశికి సప్తమంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకపోవడం, నమ్మినవారి వల్ల భారీగా డబ్బు నష్టపోవడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ఏ పనీ పూర్తి కాకపోవడం, ఎవరూ సహకరించడం పోవడం వంటివి జరుగుతాయి. దాంపత్య సుఖం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలకు దూరంగా ఉండాలన్న పక్షంలో ఈ రాశివారు చిన్నపాటి అన్నదానం చేయడం చాలా మంచిది. గోమేధికం పొదిగిన ఉంగరం ధరించడం అవసరం.
- వృశ్చికం: ఈ రాశికి పంచమంలో శని సంచారం వల్ల వీరు ఎంత ప్రయత్నించినా గుర్తింపు లభించకపోవడం, వృత్తి, ఉద్యోగాల్లో వీరి ప్రతిభ వెలుగులోకి రాకపోవడం, సంతాన నష్టం .జరగడం, పిల్లలు అనా రోగ్యాలతో ఇబ్బంది పడడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. వీటి నుంచి బయటపడాలన్న పక్షంలో గుడిలో అన్నదానం గానీ, వస్త్ర దానం గానీ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఈ రాశివారికి జీవితంలో మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అపార ధన లాభం కలుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు సంబంధించిన స్థానంలో రాహువు సంచారం వల్ల సుఖ నాశనం జరిగే అవకాశం ఉంటుంది. గృహ, వాహన సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోనూ, సామాజికంగానూ అప్ర తిష్ఠపాలు కావడం కూడా జరుగుతుంది. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడంతో పాటు, ధన యోగాలు, అధికార యోగం కలగడానికి నిత్యం దుర్గాదేవి స్తోత్రం పఠించాల్సి ఉంటుంది.
- కుంభం: ఈ రాశివారికి ధన స్థానంలో రాహువు సంచారం వల్ల ధన నష్టం జరిగే అవకాశముంటుంది. ఏదో రూపేణా డబ్బు పోగొట్టుకోవడం జరుగుతుంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి రాక ఇబ్బంది పడే అవకాశముంటుంది. నారాయణా అన్న తప్పు మాటవుతుంది. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. వీటి నుంచి బయటపడడంతో పాటు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావాలన్న పక్షంలో సుందరకాండ పారాయణం మంచిది.
- మీనం: ఈ రాశిలో రాహువు సంచారం వల్ల ప్రతి పనికీ ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఏ ప్రయత్నమూ కలిసి రాదు. రావలసిన డబ్బు చేతికి అందదు. జీతభత్యాలు కూడా చేతికి అందని పరిస్థితి ఏర్పడుతుంది. మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో విభేతాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. గుడిలో ప్రసాద వితరణ లేదా చిన్నపాటి అన్నదానం చేయడం ద్వారా ఈ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. శుభవార్తలు వింటారు.