Gajakesari Yoga: తులా రాశిలో చంద్రుడు.. ఆ రాశుల వారికి గజకేసరి యోగంతో ఆకస్మిక ధనలాభం..!
ఈ నెల 27, 28, 29 తేదీల్లో చంద్రుడు తులా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తులా రాశి మేష రాశికి సప్తమం అయినందువల్ల, మేష రాశిలో ఉన్న గురువుతో పరస్పర దృష్టి ఏర్ప డింది. దీనివల్ల అత్యంత శుభప్రదమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి కీలకమైన శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. గజకేసరి యోగం వల్ల సాధారణంగా ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం,
ఈ నెల 27, 28, 29 తేదీల్లో చంద్రుడు తులా రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తులా రాశి మేష రాశికి సప్తమం అయినందువల్ల, మేష రాశిలో ఉన్న గురువుతో పరస్పర దృష్టి ఏర్ప డింది. దీనివల్ల అత్యంత శుభప్రదమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి కీలకమైన శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. గజకేసరి యోగం వల్ల సాధారణంగా ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం, అనేక విధాలుగా ఆదాయం పెరగడం, వృత్తి, ఉద్యోగాల్లో హోదా, గౌరవ మర్యాదలు పెరగడం, ప్రతిభా పాటవాలు వెలుగులోకి రావడం, కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించడం, ప్రముఖులతో పరిచ యాలు పెరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ మూడు రోజుల్లో తీసుకునే ఏ నిర్ణయమైనా, చేపట్టిన ఏ ప్రయత్నమైనా తప్పకుండా విజయవంతం అవుతుంది.
- మేషం: ఈ రాశిలో గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల, అనేక విధాలుగా ఈ రాశివారి విశిష్టత, ప్రాధాన్యం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు. ఆదాయం బాగా పెరుగు తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. విలాసాల మీదా, సౌకర్యాల మీదా ఎక్కు వగా ఖర్చవుతుంది. నిరుద్యోగుల మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతాన యోగానికి అవకాశముంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
- మిథునం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఈ యోగం ఏర్పడినందువల్ల, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాబల్యం వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- కర్కాటకం: ఈ రాశికి రాశ్యధిపతి చంద్రుడే అయినందువల్ల ఈ రాశివారికి పూర్తి స్థాయిలో గజకేసరి యోగం పడుతుంది. ఫలితంగా, సర్వత్రా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆదాయం పెరిగి, దాదాపు ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సంతాన యోగానికి సంబం ధించి శుభ వార్త వినడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
- తుల: ఈ రాశిలో ఉన్న చంద్రుడితో సప్తమంలో ఉన్న గురువుకు వీక్షణ ఏర్పడినందువల్ల గజకేసరి యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అన్ని విధాలుగానూ ప్రాభవం పెరుగుతుంది. ఏ ప్రయ త్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడి శుభ కార్యాలు, దైవ కార్యాలు, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరుగుతుంది. రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడుతుంది. అపారమైన ధన ధాన్య వృద్ధికి అవకాశముంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ధనుస్సు: పంచమ స్థానంలో ఉన్న ఈ రాశ్యదిపతి గురువుపై లాభ స్థానంలో ఉన్న చంద్రుడి దృష్టి పడి నందువల్ల గజకేసరి యోగం ఏర్పడింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లబించడం, జీతభత్యాలు, రాబడి పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలను ఆర్జిస్తారు. నిరుద్యోగులు ఆశించిన జీతభత్యాలతో మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. మాట చెల్లుబాటవుతుంది.
- మకరం: ఈ రాశివారికి చతుర్థ, దశమ స్థానాల్లో గజకేసరి యోగం ఏర్పడినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో హోదాతో పాటు రాబడి బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం ఏర్ప డుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై, సంపద పెరుగుతుంది. నిరుద్యోగులు మంచి జీత భత్యాలతో కూడిన ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. శత్రువులు, పోటీదార్ల బెడద తగ్గుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి, విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. మంచి పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.