Weekly Horoscope: ఆ రాశుల వారు శుభ వార్తలు అందుకుంటారు.. 12 రాశుల వారికి వారఫలాలు..
వార ఫలాలు (మార్చి 24 నుంచి మార్చి 30, 2024 వరకు): మేష రాశివారికి ఈ వారమంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వార ఫలాలు (మార్చి 24 నుంచి మార్చి 30, 2024 వరకు): మేష రాశివారికి ఈ వారమంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రాశివారికి ఈ వారమంతా చాలావరకు సానుకూలంగానే గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి లేదా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. దాదాపు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఆశించిన పనులు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. దశమంలో శనీశ్వరుడి కారణంగా ఉద్యోగ జీవితంలో మధ్య మధ్య ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. అధికారుల నుంచి వేధింపులుంటాయి. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. రాశినాథుడు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులకు అండగా నిలబడతారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది పెడతాయి. కొద్దిగా ఆలస్యంగానైనా సమస్యలు, వివాదాలు పరిష్కారం అవుతుంటాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ సమాచారం అందుతుంది. ఆదాయ వృద్ధి, ఆశించిన పురోగతి తప్పకుండా ఉంటాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. మీ ఆలోచనలకు, సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. వీటివల్ల అధికారులు లబ్ధి పొందుతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వారమంతా సంతృప్తికరంగా, బాగా అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం అవుతాయి. మనసులోని కొన్ని కోరికలు నెరవేరడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం ఏర్ప డుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కొందరు బంధు మిత్రులను ఆర్థికంగా ఆదుకోవడం కూడా జరుగుతుంది. శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిపాటి శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం కూడా ఉంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్నశుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తి జీవితంలో ఏ మాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రముఖు లతో పరిచయాలు ఏర్పడతాయి. మాట చెల్లుబాటు అవుతుంది. సామాజికంగా హోదా పెరుగు తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మధ్య మధ్య ధన యోగం పట్టి, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ రాశివారికి వారంలో ఎక్కువ భాగం అనుకూలంగానే గడిచిపోతుంది. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగానే కాక, వృత్తి, ఉద్యోగాల పరంగా కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అందుకు తగ్గుట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఎవరి తోనైనా ఆచితూచి వ్యవహరించడం అన్నివిధాలా మంచిది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్య రూపంలో పెడితే సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఈ రాశివారికి ఈ వారమంతా శుభ పరిణామాలతో, శుభ వార్తలతో సాగిపోతుంది. తప్పకుండా మెరుగ్గా, శుభప్రదంగా ఉంటుంది. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గణనీ యంగా మెరుగుపడడంతో పాటు వ్యక్తిగత, కుటుంబ సమస్యలు కూడా చాలావరకు తగ్గు ముఖం పడతాయి. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభ దాయకంగా కొనసాగుతాయి. ఆదాయాన్ని పెరగడంతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా కలుగు తుంది. రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. స్నేహితులు లేదా నమ్మిన వారు మోసం చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వారమంతా ఆర్థికంగా, ఉద్యోగపరంగా శుభప్రదంగా సాగిపోతుంది. అన్ని రంగాల వారూ సత్ఫలి తాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా హోదా పెరగడంతో పాటు, సామాజికంగా పలుకుబడి పెరిగే అవకాశం ఉంది. సంసార జీవితం సుఖమయంగా సాగిపోతుంది. మీ సలహాలు, సూచనలు, ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. లాభాలపరంగా వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. లాభ స్థానంలో ఉన్న రాహువు కారణంగా అనేక విధాలుగా సంపాదన పెరుగుతుంది. అదనపు రాబడికి కూడా అవకాశముంది. విద్యార్థులు స్వల్ప ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఈ వారంలో ఈ రాశివారు ఏ ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే, ఆదాయంతో పాటు అనవసర ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మంచి సంస్థల్లోకి ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. మనసులోని కోరికలు కొన్ని నెరవేరు తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన బాగా పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఈ రాశివారి జీవితంలో ఈ వారమంతా రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరగడం ప్రారంభం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఊపందుకుంటాయి. మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలకు, కొద్దిపాటి ఒత్తిడికి అవకాశం ఉంది కానీ మొత్తం మీద చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో జీతభ త్యాలు పెరగడం, స్థిరత్వం ఏర్పడడం, తగిన గుర్తింపు లభించడం వంటివి జరిగే అవకాశముంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విదేశీ ఆఫర్లు లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మాట చెల్లుబాటవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా తగ్గే అవకాశముంది. ఆశించిన స్థాయిలో ఆర్థికాభి వృద్ధి ఉండకపోవచ్చు. ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుం డదు. విదేశీ ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభ సమాచారం అందు కుంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయంగా పలుకుబడి పెరిగే సూచనలు న్నాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. మాట తొందరపాటు వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆహార, విహా రాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ రాశివారికి వారమంతా సంతృప్తికరంగా గడిచి ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటు, మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మధ్య మధ్య స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలు తగ్గడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేపట్టడం జరుగు తుంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు.