Luck Horoscope: చురుగ్గా కదులుతున్న కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి అదృష్ట యోగాలు, శుభవార్తలు!

ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు మూడు శుభగ్రహాలతో పాటు శని, కుజుల సంచారంలో వేగం పెరుగుతోంది. ఈ గ్రహాలు చురుకుగా కదులుతున్నందువల్ల, అంటే ఇవి యాక్టివ్ గా మారు తున్నందువల్ల మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ధనుస్సు, మకర రాశుల వారు ఎక్కువగా శుభ వార్తలు మాత్రమే వినడం జరుగుతుంది.

Luck Horoscope: చురుగ్గా కదులుతున్న కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి అదృష్ట యోగాలు, శుభవార్తలు!
Lucky Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 23, 2024 | 4:40 PM

ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు మూడు శుభగ్రహాలతో పాటు శని, కుజుల సంచారంలో వేగం పెరుగుతోంది. ఈ గ్రహాలు చురుకుగా కదులుతున్నందువల్ల, అంటే ఇవి యాక్టివ్ గా మారు తున్నందువల్ల మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ధనుస్సు, మకర రాశుల వారు ఎక్కువగా శుభ వార్తలు మాత్రమే వినడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు అదృష్ట యోగాలు పట్టే అవకాశం కూడా ఉంది. ఈ శుభ పరిణామాల ఫలితంగా, ఆకస్మిక ధన లాభం, అనుకోకుండా పదోన్నతులు, అంచనాలకు మించి జీతభత్యాల పెరుగుదల, సంతాన యోగం, కుటుంబ పరిస్థితుల్లో అనుకోని మార్పులు వంటివి జరిగే సూచనలున్నాయి.

  1. మేషం: ఈ రాశివారికి దాదాపు అయిదు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడుగా మారే అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. కుటుంబంలోనే కాక, దాంపత్యంలోనూ సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. అనుకోకుండా ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  2. వృషభం: ఈ రాశివారికి శుభ గ్రహాలన్నీ అనుకూలంగా మారుతున్నాయి. ఫలితంగా ఎక్కువగా శుభ వార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ పరిణామాలు సంభవిస్తాయి. అంచ నాలకు మించి జీతభత్యాలు పెరగడం, పదోన్నతులు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యో గులకు ఊహించని విధంగా విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు ఆదాయ వృద్ధి యోగాలకు అవకాశం ఉంది.
  3. మిథునం: ఈ రాశివారికి దశమ, భాగ్య స్థానాల్లో ఉన్న గ్రహాలన్నీ చురుకుగా మారుతున్నందువల్ల, వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా మారడంతో పాటు, క్షణం కూడా తీరిక లేని పరిస్థితికి చేరుకుంటాయి. ఉద్యోగపరంగా కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడా నికి అవకాశముంది. పదోన్నతులు, ఇష్టమైన ప్రాంతాలకు స్థాన చలనాలు, జీతభత్యాల పెరుగు దల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి.
  4. కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ శనికి సంబంధించిన దుష్ఫలితాలు తగ్గిపోయి, ఆర్థిక పరిస్థితికి సంబంధించి శుభ యోగాలు, అదృష్ట యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. లాటరీ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆలస్యం అవుతున్న శుభకార్యాలు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ధన, ధాన్య, వస్తు సంపద బాగా పెరుగుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. కుటుంబ సమస్యలన్నీ చాలావరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్క బడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం పరి ష్కారం అవుతుంది. ఆస్తిపాస్తులు కొనడానికి అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు అద్భుత విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వికసిస్తాయి.
  6. మకరం: ఈ రాశికి తప్పకుండా ఒకటి రెండు అదృష్టాలు పడతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు వస్తుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. తల్లితండ్రుల వైపు నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగపరంగానే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతాలను, ఆలయాలను సందర్శిస్తారు.

సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్