దిన ఫలాలు(25 మార్చి): వారు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (మార్చి 25, 2024): మేష రాశి వారు సోమవారంనాడు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి రోజంతా బాగానే గడిచిపోతుంది కానీ, కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాడు (మార్చి 25) రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (మార్చి 25, 2024): మేష రాశి వారు సోమవారంనాడు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృషభ రాశి వారికి వ్యాపారాల్లో ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి రోజంతా బాగానే గడిచిపోతుంది కానీ, కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాడు (మార్చి 25) రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయాన్ని పెంచుకోవడానికి సంబంధించి కొన్ని కొత్త ప్రయత్నాలు చేపడతారు. ఉద్యోగ సంబంధమైన ఇంటర్వ్యూల్లో పాల్గొనాల్సి వస్తుంది. సమయం ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సత్తా చూపిస్తారు. ఇంటి పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి తిరగడం జరుగుతుంది. అనుకున్న పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్త మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
మంచి మిత్రులు ఏర్పడతారు. ఉద్యోగంలో అధికారులను మెప్పించడానికి బాగా శ్రమ పడతారు. వృత్తి జీవితంలో కొద్దిగా మార్పులు, చేర్పులు చేస్తారు. వ్యాపారాల్లో ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి ఎవరి దగ్గరా డబ్బు తీసుకోవడం, ఎవరికైనా డబ్బు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. ఆర్థిక బాధ్యతలను ఎవరికీ అప్పగించకపోవడం మంచిది. కుటుంబ బాధ్యతల్లో సతీమణి సలహాలు తీసుకోవడం అవసరం. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా బాగానే గడిచిపోతుంది కానీ, కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. వీలైనంతగా డబ్బు దాచుకోవడమే మంచిది. ఎక్కువ సమయాన్ని భక్తి మార్గానికి కేటా యిస్తారు. పెళ్లి ప్రయత్నాలను ఉధృతం చేసే అవకాశం ఉంది. చిన్న చిన్న సమస్యలకు కుంగి పోవద్దు. సతీమణి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. తల్లితండ్రుల నుంచి అవసర మైన సహాయం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ గౌరవ మర్యాదలకు భంగమేమీ ఉండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అష్టమ శని ఊరికే వదిలిపెట్టడు. మధ్య మధ్య ఏదో ఒక సమస్య సృష్టిస్తూ ఉంటాడు. చేతిలో ఉన్న డబ్బు కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొద్దిపాటి అనారోగ్యానికి కూడా అవకాశముంది. నిధుల సహాయం విషయంలో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఉద్యోగంలో మిమ్మల్ని అధికారులు బాగానే చూసుకుంటారు. ఇతరుల తగాదాల్లో తలదూరిస్తే ఇబ్బంది పడతారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వాళ్ల ధన సంపాదన బాగా పెరుగుతుంది. శరీరానికి విశ్రాంతినివ్వడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ప్రస్తుతం టైమ్ ఏమంత బాగాలేదు. నారాయణా అన్నా తప్పవుతుంది. ఇతరుల విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నోరు జారవద్దు. ఆస్తి సంబంధమైన ఒప్పందాల మీద సంతకాలు చేయక పోవడం మంచిది. డబ్బులివ్వవద్దు, తీసుకోవద్దు. ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది కానీ, వృత్తి, వ్యాపారాల్లో మాత్రం అనుకున్న లాభాలు రాకపోవచ్చు. బయట అడుగు పెడితే ఖర్చు పెరుగుతుంది. పిల్లల నుంచి, జీవిత భాగస్వామి నుంచి మంచి కబుర్లు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
మీరు అనుకునేది ఒకటయితే జరిగేది మరొకటి. ఏ పని తలపెట్టినా, ఏ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా కొద్దిగా ఇబ్బందులుంటాయి. ఆలస్యాలు జరుగుతాయి. మీ బాధ్యతలను కొన్నింటిని కుటుంబ సభ్యులు పూర్తి చేస్తారు. ఊహించని విధంగా మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నం కూడా అనుకోకుండా సఫలం అవుతుంది. వృత్తి జీవితంలో మీకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు మాత్రమే కనిపిస్తాయి. ఉద్యోగం బాగానే సాగిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఒక చేత్తో సంపాదిస్తారు. రెండు చేతులతో ఖర్చుపెడతారు. గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే మీరు డబ్బు దాచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి జీవితంలో కూడా ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల తీరుతె న్నుల్ని మార్చేసే అవకాశం ఉంది. పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. సతీమణితో నగలు, బట్టలు కొనుక్కుంటారు. మంచి స్నేహాలు ఏర్పడతాయి. తల్లి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
అర్ధాష్టమ శని ఇబ్బంది పెట్టకుండా వదిలిపెట్టడు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఇంట్లో కొద్ది పాటి చికాకులుంటాయి. ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. అన్నీ సర్దుకుంటాయి. ఉద్యోగ జీవి తం సాధారణంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. తల్లి వైపు బంధువులతో సమస్యలుంటాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తే మంచిది. టైమ్ బాగా ఉంది. పిల్లల చదువుల విషయంలో కాస్తంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
మీ మాటకు, చేతకు ఎదురుండదు. గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగాల్లో అధికారులకు మీ పనిపాటలు నచ్చుతాయి. మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీరిచ్చే సలహాలు, సూచనలు కొందరికి బాగా ఉపయోగపడతాయి. ఇష్టమైన ఆలయాలకు వెళ్లి అర్చనలు చేయిస్తారు. సత్సంగాలు, దైవ కార్యాల్లో ఎక్కువగానే పాల్గొంటారు. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశ ముంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వాక్ స్థానంలో శని, కుజుల సంచారం వల్ల ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడడం మంచిది. తొందర పాటుగా మాట్లాడినా, నోరుజారినా అనర్థాలు తప్పవు. డబ్బు ఇవ్వాల్సిన వారు ఒకపట్టాన డబ్బు ఇవ్వరు. వృత్తి, ఉద్యోగాలపరంగా రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగానే ఉంటుంది. లక్ష్యాలను, బాధ్యతలను పూర్తి చేయడం కష్టమవుతుంది. వ్యాపారాల్లో సగం ఫలితం మాత్రమే చేతికి అందుతుంది. కాస్తంత జాగ్రత్తగానే ఉండడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని ప్రభావం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాక ఇబ్బంది పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. డబ్బుకు లోటుండదు కానీ, సుఖపడడం బాగా తక్కువగా ఉంటుంది. బంధువుల తాకిడి వీటికి తోడవుతుంది. పిల్లలు శుభవార్తలు తీసుకు వస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఇష్టమైన ఆలయాలకు వెళ్లి వస్తారు. ఇష్టమైన మిత్రులను కలుసుకుంటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనేక పనులు పెట్టుకుంటారు కానీ, చివరికి ఒక్కటి కూడా పూర్తి కాదు. ఖర్చులు మంచినీళ్ల ప్రాయంగా బాగా పెరుగుతాయి. వైద్య ఖర్చులు కూడా ఎక్కువవుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల ఆధ్యాత్మిక చింతన మాత్రం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. పొగడ్తలతో పని చేయించుకుంటారు. వృత్తి జీవితంలో విశ్రాంతి ఉండదు. ఆదాయానికి లోటుండదు కానీ, ఇందులో సగానికి సగం పాదరసంలా జారిపోతుంది. సతీమణి సహకారం ఎక్కువగానే ఉంటుంది.