Luxury Life Astrology: శుక్రుడిపై శుభ దృష్టి.. ఆ రాశుల వారికి విలాస జీవితం పక్కా..!

సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు, శృంగార జీవితానికి, ప్రేమలు, పెళ్లిళ్లకు శుక్రుడు కారకుడు. శుక్రుడి మీద ఈ నెలాఖరు వరకు గురు, కుజుల దృష్టిపడనుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి విలాస జీవితం అలవడుతుంది. ప్రేమ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధాలు కుదురే అవకాశముంది.

Luxury Life Astrology: శుక్రుడిపై శుభ దృష్టి.. ఆ రాశుల వారికి విలాస జీవితం పక్కా..!
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 18, 2024 | 8:27 PM

ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడిని వృషభ రాశి నుంచి వక్ర గురువు, కర్కాటక రాశి నుంచి వక్ర కుజుడు పూర్ణ దృష్టితో వీక్షిస్తున్నాయి. సుఖ సంతోషాలకు, భోగభాగ్యాలకు, శృంగార జీవితానికి, ప్రేమలు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడి మీద ఈ నెలాఖరు వరకు గురు, కుజుల దృష్టిపడడం వల్ల కొన్ని రాశుల వారికి విలాస జీవితం అలవడుతుంది. ప్రేమ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. వ్యసనాలకు, అనవసర పరిచయాలకు కూడా అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారి జీవితాలు నిత్య కల్యాణం, పచ్చతోరణంలా సాగిపోతాయి.

  1. మేషం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడి మీద కుజ, గురుల దృష్టి పడినందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించడం వంటివి జరుగుతాయి. ఫలితంగా జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. విలాస జీవితం అలవడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమలో పడే అవకాశం ఉంది. దాంపత్య జీవితం నిత్య కల్యాణంగా సాగిపోతుంది.
  2. వృషభం: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు సంచారం చేయడం ఒక విశేషం కాగా, దాన్ని గురు, కుజులు వీక్షించడం మరో విశేషం. విపరీత రాజయోగాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. విలాసాల్లో మునిగి తేలుతారు. జీవనశైలిలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడంగానీ, పెళ్లి ఖాయం కావడం గానీ జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర సంచారం జరుగుతుండడం, దాన్ని గురు, కుజులు వీక్షించడం వల్ల అనేక మార్గాల్లో సంపద వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభి స్తుంది. ఫలితంగా ఆడంబరమైన జీవితంతో పాటు, విలాసాలు బాగా వృద్ధి చెందుతాయి. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. వ్యసనాలు, అనవసర పరిచయాలకు కూడా అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న శుక్రుడిని భాగ్య స్థానం నుంచి గురువు, లాభ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల మహా భాగ్య యోగం కలిగింది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరగ డంతో పాటు ఆస్తిపాస్తులు కలిసి రావడం, ఆస్తుల విలువ పెరగడం వంటివి కూడా జరుగుతాయి. ఫలితంగా భోగభాగ్యాలతో జీవించడం ప్రారంభమవుతుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరు గుతాయి. జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి. విలాసవంతమైన జీవితం అలవడుతుంది.
  5. తుల: చతుర్థ (సుఖ సంతోషాలు) స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శుక్రుడి మీద గురు, కుజుల దృష్టి పడడం వల్ల భోగభాగ్యాలతో పాటు సుఖ సంతోషాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశివారికి తప్పకుండా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర పెట్టుబ డులు లాభాల పంట పండిస్తాయి. ఫలితంగా విలాస జీవితానికి అలవాటు పడడం జరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది.
  6. మకరం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడిని గురు, కుజులు వీక్షించడం వల్ల ఈ రాశివారు అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. రావలసిన డబ్బంతా చేతికి అందుతుంది. ఫలితంగా జీవనశైలిలో మార్పు వస్తుంది. విలాస జీవితానికి అలవాటు పడడం జరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలతో పాటు కొన్ని అనవసర పరిచయాలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది.

శుక్రుడిపై శుభ దృష్టి.. ఆ రాశుల వారికి విలాస జీవితం పక్కా..!
శుక్రుడిపై శుభ దృష్టి.. ఆ రాశుల వారికి విలాస జీవితం పక్కా..!
అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తి ఎంతంటే?
అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తి ఎంతంటే?
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
భారత్‌లో పెరుగుతున్న షుగర్ పేషెంట్స్.. నిపుణుల సలహా ఏమిటంటే
భారత్‌లో పెరుగుతున్న షుగర్ పేషెంట్స్.. నిపుణుల సలహా ఏమిటంటే
త్రుట్టిలో తప్పించుకున్న రోహిత్.. జర్రుంటే చిక్కుల్లో పడేవాడు..!
త్రుట్టిలో తప్పించుకున్న రోహిత్.. జర్రుంటే చిక్కుల్లో పడేవాడు..!
ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా.? తక్కువ ధరలో ది బెస్ట్స్ ఇవే.!
ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా.? తక్కువ ధరలో ది బెస్ట్స్ ఇవే.!
మహేశ్ బాబు- రాజమౌళి సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
మహేశ్ బాబు- రాజమౌళి సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
వీళ్ళేం దొంగలురా సామీ.. వాటిని కూడా వదల్లేదు..!
వీళ్ళేం దొంగలురా సామీ.. వాటిని కూడా వదల్లేదు..!
సొమ్ములు మీవైతే షాపింగ్ వేరే వారిది..!
సొమ్ములు మీవైతే షాపింగ్ వేరే వారిది..!
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా