Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (డిసెంబర్ 19, 2024): మేష రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (డిసెంబర్ 19, 2024): మేష రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
లాభ స్థానంలో లాభాధిపతి శని, ధన స్థానంలో భాగ్యాధిపతి గురువు సంచారం చేస్తున్నంత కాలం ఈ రాశివారికి ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి కొన్ని శుభ సూచకాలు కనిపిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
దశమ స్థానంలో సంచారం చేస్తున్న శని వల్ల పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లాభ స్థానంలో రాహువు కారణంగా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతూ ఉంటుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. వీలైనంతగా డబ్బును జాగ్రత్త చేసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరులకు వీలైనంతగా సహాయ పడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆహార, విహారాల్లోజాగ్రత్తగా ఉండడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
లాభ స్థానంలో గురువు, పంచమ స్థానంలో బుధుడు ఆదాయాన్ని బాగా పెంచుతాయి. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడతారు. కొన్ని రకాల మానసిక ఆందోళనలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం లాభసాటిగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
దశమ స్థానంలో గురువు ఉన్నంత కాలం ఉద్యోగానికి ఢోకా ఉండదు. ఉద్యోగ జీవితం సానుకూ లంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా సమస్యలు, ఒత్తిళ్లు, ఇబ్బందులు క్రమంగా తగ్గు ముఖం పడతాయి. రాశ్యధిపతి రవి పంచమ స్థానంలో ప్రవేశించడంతో ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తు న్నవారు శుభవార్తలు వింటారు. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల ధన యోగాలు పడతాయి. ఆరవ స్థానంలో శని సంచారం వల్ల ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా తగ్గిపోతాయి. కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం, ధన స్థానంలో బుధుడి సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు. వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఈ రాశిలో లాభాధిపతి బుధుడు, సప్తమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల జీవి తంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబం ధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఇంటా బయటా అనుకూలతలు కలుగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ధన స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో శనీశ్వరుడు ఉన్నందువల్ల ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు, ఆదాయ లాభాలు కలుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరు ద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు ఏమాత్రం లోటుండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
గురు, రాహు, శని, శుక్ర, బుధుల అనుకూలత వల్ల జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలకు లోటుం డదు. వ్యాపారాల్లో నష్టాలు బాగా తగ్గుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
దశమ స్థానంలో బుధుడు, లాభ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అధిక లాభం పొందుతారు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
లాభ స్థానంలో శుక్రుడు, భాగ్య స్థానంలో బుధుడు, దశమ స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల అన్ని విషయాల్లోనూ అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థి కంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యాపారాలు లాభాల బాటపడతాయి. దైవ చింతన పెరిగి ఆలయాలను సంద ర్శిస్తారు. పిల్లలు బాగా పురోగతి చెందుతారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు వింటారు.