Zodiac Signs: మేష రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి భోగ భాగ్యాలు..! మీ రాశికి ఎలా ఉందంటే..?
గురు గ్రహమైనా, మీన రాశి అయినా సాత్వికంగా, సున్నితంగా, ఆధ్యాత్మికంగా ఉంటాయి. అటువంటి స్థానంలో సుమారు నెల రోజులుగా ఉన్న శుక్ర గ్రహం ఈ నెల 25 నుంచి ఒక నెల రోజుల పాటు ‘హాట్ ప్లేస్’ మేష రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు ఇక ఆధ్యాత్మిక చింతనను వదిలిపెట్టి, భౌతికమైన సుఖ సంతోషాల కోసం..
గురు గ్రహమైనా, మీన రాశి అయినా సాత్వికంగా, సున్నితంగా, ఆధ్యాత్మికంగా ఉంటాయి. అటువంటి స్థానంలో సుమారు నెల రోజులుగా ఉన్న శుక్ర గ్రహం ఈ నెల 25 నుంచి ఒక నెల రోజుల పాటు ‘హాట్ ప్లేస్’ మేష రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. శుక్రుడు ఇక ఆధ్యాత్మిక చింతనను వదిలిపెట్టి, భౌతికమైన సుఖ సంతోషాల కోసం, సిరిసంపదల కోసం వెంపర్లాడడం ప్రారంభిస్తాడు. మేష రాశితో పాటు, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల దృష్టి ఆదాయ వృద్ధి, సుఖ సంతోషాలు, విలాసాలు, శృంగార జీవితం, ఇళ్లు, వాహనాల మీద పడేటట్టు చేస్తాడు.
- మేషం: ఈ రాశిలో శుక్రుడి సంచారం ఈ రాశివారి జీవితాన్నే మార్చేస్తుంది. ధన సంపాదన మీద వ్యామోహాన్ని పెంచుతుంది. అదనపు ఆదాయం కోసం అహర్నిశలూ కష్టపడేటట్టు చేస్తుంది. అనేక విషయాల్లో ఈ రాశివారు విజయాలు సాధిస్తారు. ఉద్యోగం, పెళ్లి, గృహం, ప్రేమ, డబ్బు వంటి విషయాల్లో వీరి ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఇవన్నీ అప్రయత్నంగా సమకూరే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది.
- మిథునం: ఈ రాశివారికి లాభ స్థానంలో శుక్రుడి ప్రవేశంతో ఏ పని తలపెట్టినా లాభదాయకం అవుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు ఆస్కారం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. నిరు ద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. కోరుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
- సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు సంచారం చేయడం తప్పకుండా అనేక శుభ పరిణామాలకు దోహదం చేస్తుంది. నిరుద్యోగులకు ఎక్కువగా విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు విదేశాల్లో స్థిరత్వాన్ని సంపాదించుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆస్తి వివాదం సాను కూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఆదాయానికి లోటుండదు.
- తుల: ఈ రాశినాథుడైన శుక్రుడు సప్తమ రాశిలో ప్రవేశించడం అన్నది ఈ రాశివారికి అనేక విషయాల్లో కొండంత అండ అవుతుంది. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశ ముంది. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకూలవతితో ప్రేమలో పడ తారు. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. ఉద్యోగంలో మీ ప్రత్యేక తలు, నైపుణ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో దాదాపు కుబేరులవుతారు.
- ధనుస్సు: ఈ రాశివారికి పంచమ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజి కంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. ఏ ప్రయత్న మైనా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితిలో బాగా మార్పు వస్తుంది. సాధారణ జీవితం నుంచి సంపన్న జీవితానికి ఎదిగే అవకాశముంటుంది. సంతానానికి సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది.
- మకరం: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల గృహ, వాహన సంబంధమైన ఆటంకాలు, సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. దాంపత్య జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.