Rashi Parivartan Yoga: కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం..

ఈ నెల 24వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు కుజ, గురు గ్రహాల మధ్య రాశి పరివర్తన జరగబోతోంది. జ్యోతిషశాస్త్రంలో పరివర్తన యోగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గురువుకు చెందిన మీన రాశిలో కుజుడు, కుజుడికి చెందిన మేష రాశిలో గురువు సంచారం వల్ల కొన్ని రాశుల వారు తప్పకుండా ఉచ్ఛ స్థితిలోకి..

Rashi Parivartan Yoga: కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం..
Rasi Parivarthan Yoga
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 18, 2024 | 7:15 PM

ఈ నెల 24వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు కుజ, గురు గ్రహాల మధ్య రాశి పరివర్తన జరగబోతోంది. జ్యోతిషశాస్త్రంలో పరివర్తన యోగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గురువుకు చెందిన మీన రాశిలో కుజుడు, కుజుడికి చెందిన మేష రాశిలో గురువు సంచారం వల్ల కొన్ని రాశుల వారు తప్పకుండా ఉచ్ఛ స్థితిలోకి, ఉన్నత స్థానాల్లోకి రావడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల పరివర్తన వల్ల మేషం, మిథునం, కర్కాటకం, ధనుస్సు, మకరం, మీన రాశులకు భాగ్య యోగం, రాజయోగం పట్టడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశినాథుడైన కుజుడికి అత్యంత శుభ గ్రహమైన గురువుతో పరివర్తన చెందడం నిజంగా ఒక విశేషమే అవుతుంది. ఈ రెండూ మిత్ర గ్రహాలే అయినందువల్ల, ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది. భారీగా జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగులు కూడా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది. విలాస జీవితం గడపడం జరుగుతుంది.
  2. మిథునం: ఈ రాశివారికి దశమ, లాభస్థానాల మధ్య రాశి పరివర్తన జరగడం వల్ల ఉద్యోగ జీవితంలో సాను కూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతులకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారం లాభాలపరంగా పురోగతి సాధించడమే కాకుండా విస్తరించే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందివస్తాయి.
  3. కర్కాటకం: ఈ రాశివారికి దశమ, భాగ్యస్థానాల పరివర్తన వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా లాభం ఉంటుంది. ఉద్యోగంలో భారీగా జీతభత్యాలు పెరగడంతో పాటు, పదోన్నతులకు కూడా అవకాశముంటుంది. జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా విస్తరిస్తాయి. లాభాలు ఊపం దుకుంటాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  4. ధనుస్సు: ఈ రాశివారికి నాలుగు, అయిదు రాశుల మధ్య పరివర్తన జరగడం ఒక గొప్ప రాజయోగం. అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ప్రభుత్వ మూలంగా కూడా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. సామాజికంగా కూడా ప్రాముఖ్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది.
  5. మకరం: ఈ రాశివారికి గురు, కుజుల పరివర్తన వల్ల అర్ధాష్టమ గురువు దోషం కూడా తొలగిపోయి, జీవి తంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. పదో న్నతికి అవకాశముంది. ప్రతిభా పాటవాలు మరింతగా వెలుగులోకి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి ఒప్పందాలు కుదురుతాయి. గృహ, వాహన యోగాలకు సంబంధించి అనుకూ లతలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.
  6. మీనం: ఈ రాశికి ధన స్థానంతో పరివర్తన ఏర్పడినందువల్ల ఆర్థికపరమైన అదృష్టాలు పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ధనపరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, రాబడి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇంట్లో ముఖ్యమైన శుభ కార్యాలు జరగడానికి అవకాశముంది. మీ మాటకు, చేతకు విలువ ఉంటుంది.