Navratri 2023: నవరాత్రుల్లో నేడు విశిష్టమైన రోజు కాళరాత్రి.. శని దోష నివారణకు చేయాల్సిన పూజ.. దానాలు మీ కోసం

నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి దేవి ని పూజించడం ద్వారా శని దోషం తొలగిపోతుంది. విశేషమేమిటంటే శని దోష నివారణకు చేసే  కాళరాత్రి దేవికి పూజ యాదృచ్ఛికంగా శనివారం జరగడం విశేషం. ఈ రోజు కాళరాత్రి దేవి, శనిదేవుని ఆరాధనకు సంబంధించిన ఖచ్చితమైన నివారణ గురించి తెలుసుకుందాం.. ఇలా చేయడం ద్వారా శని దోషం, ఏలినాటి శని బాధలనుంచి బయటపడవచ్చు. 

Navratri 2023: నవరాత్రుల్లో నేడు విశిష్టమైన రోజు కాళరాత్రి.. శని దోష నివారణకు చేయాల్సిన పూజ.. దానాలు మీ కోసం
Navaratri Kalaratri Devi
Follow us

|

Updated on: Oct 21, 2023 | 9:35 AM

నవగ్రహాల్లో కర్మ ఫలదాత శనీశ్వరుడి అంటే వ్యక్తులకు భయం.. తమ సుఖ సంపదలను హరింపజేసి.. కష్టాలను కలిగిస్తాడంటూ తరచుగా అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. అందుకనే శనీశ్వరుడి అనుగ్రహం తమపై సదా ఉండాలని కోరుకుంటారు. పూజిస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్య తనయుడు శని గ్రహ ప్రభావం గురించి పేర్కొన్నారు. శనీశ్వరుడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. మనస్సులో సంచలనం కలుగుతుంది. ఎందుకంటే శని ప్రభావం, ఏలినాటి శని వంటి బాధలను ప్రజలకు ఇస్తాడు శనీశ్వరుడు. జ్యోతిష్యం ప్రకారం ఎవరైనా ఏలినాటి శని బారిన పడితే.. ఆ వ్యక్తి అనారోగ్యం బారిన పడతారు. మానసికంగా ఆందోళన పడతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటాడు.

ఎవరైనా శని దోషం వల్ల  రకరకాల సమస్యలతో సతమతమవుతున్నట్లయితే.. ఈ రోజు ఆ దోషం నుంచి బయటపడటానికి చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి దేవి ని పూజించడం ద్వారా శని దోషం తొలగిపోతుంది. విశేషమేమిటంటే శని దోష నివారణకు చేసే  కాళరాత్రి దేవికి పూజ యాదృచ్ఛికంగా శనివారం జరగడం విశేషం. ఈ రోజు కాళరాత్రి దేవి, శనిదేవుని ఆరాధనకు సంబంధించిన ఖచ్చితమైన నివారణ గురించి తెలుసుకుందాం.. ఇలా చేయడం ద్వారా శని దోషం, ఏలినాటి శని బాధలనుంచి బయటపడవచ్చు.

కాలరాత్రి మంత్రం

ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉండి ఇబ్బంది పడుతూ.. ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే, మీ చింతలన్నీ తొలగిపోవడానికి.. ఈరోజు దుర్గాదేవి సప్తమ రూపం కాళరాత్రి దేవిని  ‘ఓం ఐం హ్రీం క్లీం’ అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించండి. 108 సార్లు ‘కాలరాత్రియ నమః’ అని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సాధకుడు దేవతతో పాటు శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతాడని, అతని జాతకంలో శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

శనిదేవుని మహామంత్రం

జాతకంలో శని దోషం ఉన్నట్లయితే.. ఈ రోజు కాళరాత్రి దేవి ఆరాధన మంత్రాన్ని శని ‘నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం’  అంటూ పఠించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా ఈ మంత్రాన్ని 92000 సార్లు జపిస్తే లేదా వేద బ్రాహ్మణులచే పూర్తి చేయించినట్లు అయినా అతను శని సంబంధమైన అన్ని కష్టాలు త్వరగా తొలగిపోతాయి.

శనీశ్వరుడికి చేయాల్సిన పరిహారం

ఎవరి జాతకంలో నైనా శని దోషం ఉండి.. అది తొలగిపోవాలంటే కాళరాత్రి దేవికి పూజలు, జపములతో పాటు, ఈ రోజు ముఖ్యంగా శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులను దానం చేయడంతో దోషనివారణ జరుగుతుంది.  శనివారం నాడు వికలాంగులకు నల్ల దుప్పటి, నల్లని బూట్లు, నల్ల దుస్తులు, నల్ల నువ్వులు, తేయాకు, నల్ల గొడుగు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా శని దోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. దానంతో పాటు ఈరోజు సాయంత్రం రావి చెట్టు కింద పిండితో చేసిన దీపాలను నాలుగు దిక్కుల నాలుగు దీపాలను ఆవాల నూనె వేసి వెలిగించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.