AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారికి చిన్నపాటి ప్రయత్నంతో పెద్ద ఫలితం.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 28, 2023 వరకు): మేష రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి శుక్ర, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందికరమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభ వార్త వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: వారికి చిన్నపాటి ప్రయత్నంతో పెద్ద ఫలితం.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
Weekly Horoscope 22 28 October 2023
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 22, 2023 | 6:20 AM

Share

వార ఫలాలు (అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 28, 2023 వరకు): మేష రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి శుక్ర, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందికరమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభ వార్త వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పని తీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ లాభసాటిగా పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. కొందరు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెంపొందు తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు కానీ, అనవసర ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది. భరణి నక్షత్రం వారి విష యంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. సతీమణికి ఆశించిన పురోగతి ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

శుక్ర, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందికరమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, అవనసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో డిమాండ్ పెరుగుతుంది., ఆశించిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహ కారం ఉంటుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కృత్తికా నక్షత్రం వారికి విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగస్థానాధిపతి అయిన గురువు లాభంలో ఉండడం వల్ల ఉద్యోగానికి సంబంధించిన ఏ అంశ మైనా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభ వార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి సంబంధ మైన వివాదం నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ వ్యవ హారాలను చక్కదిద్దడంలో తల్లితండ్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పిల్లలు తేలికగా విజయాలు సాధిస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అష్టమ శని, దశమంలో గురువు కారణంగా ఇంటా బయటా పని భారం ఎక్కువగా ఉండడం, బరువు బాధ్యతలు పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. వారమంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో కష్టానికి తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. సాధారణ సమస్యలను, బంధువుల విమర్శలను పట్టించుకోవద్దు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ, మొత్తం మీద కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. గృహ, వాహన సౌకర్యాల విషయంలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గురు, శుక్ర, బుధ గ్రహాల సంచారం శుభప్రదంగా ఉంది. ఫలితంగా అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉన్నట్టు భావించవచ్చు. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. కృషికి తగిన ఫలితం అందుతుంది. అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్ కు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల దండగ ఖర్చులు పెరుగుతాయి. పుబ్బా నక్షత్రం వారికి ఎదురు చూస్తున్న అవకాశాలు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడు, ధన స్థానంలో ఉన్న రాశినాథుడు బుధుడు ఊహించని శుభ ఫలితాలను ఇస్తారు. మీ ఆలోచనలు, ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యో గాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపా రాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. బంధు మిత్రుల్లో కొందరికి మీ సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది. సతీమణికి సమయం అనుకూలంగా ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గురు, శుక్ర, బుధ, శనీశ్వరులు బాగా అనుకూలంగా ఉన్న కారణంగా దాదాపు పట్టిందల్లాఝ బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో మీఆలోచనలు, కార్యక్రమాలు ఘన విజయం సాధి స్తాయి. వ్యాపారాలలో అంచనాలకు మించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావ కాశాలు కలిసి వస్తాయి. వాటిని వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవ కాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. స్వాతి, విశాఖ నక్షత్రాల వారు ఆశించిన శుభవార్తలు అందుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఒక్క శుక్ర గ్రహం తప్ప మరే గ్రహమూ అనుకూలంగా లేనందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభ వానికి వస్తాయి. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా గట్టెక్కుతారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. బంధు మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. సతీమణికి, పిల్లలకు సమయం అనుకూ లంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. జ్యేష్టా నక్షత్రం వారికి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. జీవిత భాగ స్వామికి ఉరోగతి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ధన స్థానంలో రాశినాథుడైన శనీశ్వరుడి సంచారం, దశమ స్థానంలో రవి, బుధ, కుజుల సంచారం చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. చిన్నపాటి ప్రయత్నం కూడా గరిష్ఠంగా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అన్ని విషయాలలోనూ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్త వుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యో గులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడ తాయి. కుటుంబ సమస్యలపై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార విహా రాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉత్తరాషాఢ వారికి అధికార యోగం పడు తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఏలిన్నాటి శని కారణంగా ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఒకేసారి అనేక వ్యవహారాలను చక్కబెట్టాలని ప్రయత్నిస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. సన్నిహితులతో అపార్థాలు తలెత్త వచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్య మైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించకపోవచ్చు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి సానుకూల ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి అయిన గురు సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అదనపు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావ కాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహా రాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ పెరుగు తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది. సతీమణి నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

Follow Us