Shani Dosham: ఆర్ధిక కష్టాలా.. శని దోష నివారణ కోసం శనివారం ఈ ఐదు పరిహారాలు చేసి చూడండి
ఏ వ్యక్తి జాతకంలో శని దోషం ఉందో..అతని జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. శని దోషం కారణంగా అనేక కష్టాలు, నష్టాలను పడాల్సి ఉంటుంది. శనీశ్వరుడు చెడు దృష్టిపడిన చోట. సంతోషకరమైన కుటుంబం సైతం దుఃఖాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రతి మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల మార్పుల కారణంగా ఒక వ్యక్తి జీవితం ప్రభావితమవుతుంది. ఒక వ్యక్తి జాతకంలో దోషాల కారణంగా కొన్నిసార్లు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నవ గ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడు న్యాయ దేవతగా పరిగణించబడుతున్నాడు. అంటే చెడు కర్మలకు చెడునివ్వడం.. మంచి కర్మలకు శుభ ఫలితాలను ఇవ్వడం చేస్తూ ఉంటాడు శనీశ్వరుడు. ఏ వ్యక్తి జాతకంలో శని దోషం ఉందో..అతని జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. శని దోషం కారణంగా అనేక కష్టాలు, నష్టాలను పడాల్సి ఉంటుంది. శనీశ్వరుడు చెడు దృష్టిపడిన చోట. సంతోషకరమైన కుటుంబం సైతం దుఃఖాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అదే సమయంలో ఎవరి జాతకంలో శనీశ్వరుడు శుభ దృష్టి ఉంటుందో.. వారు సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు. అటువంటి వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయి. అబద్ధం చెప్పని వ్యక్తి, ఇతరుల పట్ల అసూయ ద్వేషాలు లేని వ్యక్తి పట్ల శనీశ్వరుడు ప్రత్యేక అనుగ్రహం కురిపిస్తాడు. కనుక శనీశ్వరుడు చెడు ప్రభావాలను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా శనివారం రోజున కొన్ని చర్యలు పాటిస్తే.. శని శుభ దృష్టిని కలిగిస్తాడు. అలాంటి కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం.
- శనిదేవునితో సంబంధం ఉన్న దోషాలను తొలగించడానికి శనివారం రావి చెట్టును పూజించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. శనివారం సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీటిని సమర్పించండి. దీని తరువాత, నూనె దీపం వెలిగించి, శనీశ్వరుడుకి నూనె సమర్పించండి.
- శనీశ్వరుడు పూజ సమయంలో.. మీరు శని దేవుడి కళ్ళలోకి చూడకూడదు. ఆరాధన సమయంలో భక్తులు తమ కళ్ళను కిందకు ఉంచాలి. పూజ సమయంలో శనీశ్వరుడు ని కళ్లలోకి చూసే వ్యక్తిపై శని చెడు చూపు ప్రభావం పడుతుందని విశ్వాసం. దీంతో వారి జీవితంలో సమస్యలు మొదలవుతాయి.
- రత్నాన్ని ధరింస్తే శనీశ్వరుడు దుష్ప్రభావాల నుండి రక్షించబడతారని నమ్ముతారు. అయితే జ్యోతిష్యుడిని సంప్రదించకుండా మీరు ఎలాంటి రత్నాన్ని ధరించకూడదని గుర్తుంచుకోండి. తప్పు రత్నాన్ని ధరింస్తే.. శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. శనీశ్వరుడు దోషం తొలగిపోవడానికి నీలమణిని ధరించడం శుభప్రదమని విశ్వాసం.
- సనాతన ధర్మ లో విశ్వాసాల ప్రకారం.. శని దోషాన్ని తొలగించడంలో దానం, దక్షిణ కూడా చాలా ముఖ్యమైనవి. మీ జాతకంలో శని దోషం ఉన్నట్లయితే.. శనివారం రోజున అవసరం ఉన్నవారిని ఆదుకోండి. నల్ల నువ్వులు, నల్ల గొడుగులు మొదలైనవి దానం చేయండి.
- శని దోషం తో ఏర్పడే చెడు ప్రభావాలను నివారించాలనుకుంటే, శనివారంరోజున నూనెతో నిండిన గిన్నెను ఉంచి, అందులో మీ ముఖాన్ని చూడండి. ఇలా చేస్తున్నప్పుడు శనిదేవుడిని స్మరించుకోండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.
మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)