Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: 50 ఏళ్ల తర్వాత విపరీత రాజయోగం.. ఫలితంగా ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారవృద్ధి.. ఆకస్మిక ధనప్రాప్తి..

దాదాపు 50 సంవత్సరాల తర్వాత విపరీత రాజయోగం ఏర్పడబోతుంది. ఫలితంగా కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభంతో పాటు పురోగతిని లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభ..

Astrology: 50 ఏళ్ల తర్వాత విపరీత రాజయోగం.. ఫలితంగా ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారవృద్ధి.. ఆకస్మిక ధనప్రాప్తి..
Vipreet Rajyoga
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 01, 2023 | 2:02 PM

గ్రహనక్షత్రరాశుల కదలిక కారణంగా మానవ జీవితం అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. ఈ క్రమంలోనే దాదాపు 50 సంవత్సరాల తర్వాత విపరీత రాజయోగం ఏర్పడబోతుంది. ఫలితంగా కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభంతో పాటు పురోగతిని లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభ యోగాలలో విపరీత రాజయోగం కూడా ఒకటి. వాస్తవానికి విపరీత రాజయోగాలు 3 రకాలు. అవి హర్ష రాజయోగం, సరళ రాజయోగం, విమల రాజయోగం. జాతకంలో 6వ పాదం అధిపతి.. 8వ లేదా 12వ పాదంలో ఉంటే హర్ష రాజయోగం ఏర్పడుతుంది. ఇలా కాకుండా 8వ పాదం అధిపతి.. 6 లేదా 12వ పాదాన్ని ఆక్రమిస్తే  సరళ రాజయోగం ఏర్పడుతుంది. అలాగే 12వ పాదాధిపతి.. 6 లేదా 8వ పాదంలో ఉన్నప్పుడు విమల రాజయోగం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఏర్పడబోతున్న విపరీత రాజయోగం ఏయే రాశులవారికి శుభకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నాలుగు రాశులవారికి విపరీత రాజయోగం శుభకరం..

మేషరాశి: మేష రాశి వారికి ఈ విపరీత రాజయోగం ఎంతో మేలు చేస్తుంది.  ఈ సమయంలో మేషరాశి వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. పోటీపరీక్షల్లో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు.వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు.

సింహరాశి: సింహ రాశికి అధిపతి బుధుడు.. బృహస్పతితో పాటు ఎనిమిదవ పాదంలో ఉండబోతున్నాడు. మూడవ పాదానికి అధిపతి శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడు. ఫలితంగా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు పూర్వీకుల ఆస్తిని పొందుతారు. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.

తులారాశి: తుల రాశి వారికి విపరీత రాజయోగం వరంలా మారుతుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఆర్డర్‌లను పొందుతారు. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి. మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.  మీరు ఈ సమయంలో స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది.

మకరరాశి: మకర రాశి వారికి విపరీత రాజయోగం శుభప్రదం అవుతుంది. జాతకంలో మూడవ పాదంలో గురువు, బుధుడు, సూర్యుడు ఉండడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)