Telugu Astrology: వింత గ్రహ కూటమి.. ఆ రాశులవారి జీవితాలలో కొత్త వెలుగులు.. వైఫైలా అదృష్టం..

ఒక్క కేతు గ్రహం మినహాయించి మిగిలిన గ్రహాలన్నీ కుంభరాశి నుంచి మిధున రాశి వరకు బారులు తీరుతున్నాయి. ఇది నిజంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగించే పరిణామం. జాతక చక్రంలో ఈ విధంగా ఎనిమిది గ్రహాలు పై భాగంలోనే ఉండటం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

Telugu Astrology: వింత గ్రహ కూటమి.. ఆ రాశులవారి జీవితాలలో కొత్త వెలుగులు.. వైఫైలా అదృష్టం..
Horoscope Today Image Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 31, 2023 | 5:16 PM

ఈ వారంలో ఆకాశంలో వింత పుట్టించే విధంగా గ్రహగతులు మారుతున్నాయి. ఒక్క కేతు గ్రహం మినహాయించి మిగిలిన గ్రహాలన్నీ కుంభరాశి నుంచి మిధున రాశి వరకు బారులు తీరుతున్నాయి. ఇది నిజంగా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగించే పరిణామం. జాతక చక్రంలో ఈ విధంగా ఎనిమిది గ్రహాలు పై భాగంలోనే ఉండటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దీనివల్ల కింది రాశుల వారిలో కొందరికి వారి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి వింత గ్రహ కూటమి ఏర్పడినప్పుడు 40 రోజులలోగా కొన్ని రాశుల వారు ఎన్నో మంచి ప్రయోజనాలు పొందడం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఏ ఏ రాశుల వారు ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారో ఇక్కడ తెలుసుకుందాం. సింహం, తుల, ధనస్సు మకరం రాశుల వారు కొన్ని అనుకోని అదృష్టాలను అనుభవించడం జరుగుతుంది.
  1. సింహ రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానం నుంచి లాభ స్థానం వరకు గ్రహాలు వరుస కడుతున్నందువల్ల వివాహం, సంతానం, ఉద్యోగం, ఆదాయం వంటి విషయాలలో ఆకస్మిక సానుకూల మార్పులకు తప్పకుండా అవకాశం ఉంటుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదరటం, సంతానానికి సంబంధించి శుభవార్త వినడం. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటం, ఆదాయం పెరగడం వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి 40 రోజుల లోగా తప్పనిసరిగా తీపి కబుర్లు వింటారని చెప్పవచ్చు. నిరుద్యోగులు సైతం ఉద్యోగాలలో స్థిరపడటానికి అవకాశం ఉంటుంది. విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు.
  2. తులా రాశి:  ఈ రాశి వారికి ఐదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానం వరకు గ్రహాలు క్యూ కడుతున్నాయి. ఇటువంటి గ్రహ గతిని ఒక మహాయోగం కింద పరిగణించడం జరుగుతుంది. సంతానం, సంపాదన, ఆరోగ్యం, అన్యోన్యతల మీద ఈ గ్రహ కూటమి ప్రభావం విశేషంగా ఉంటుంది. సంతానం కలగటం, సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వినటం, పిల్లలు వృద్ధిలోకి రావడం వంటివి సంభవిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో అనూహ్యంగా సంపాదన పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు, విభేదాలు, వివాదాలు ఉన్నప్పటికీ అవి సానుకూలంగా పరిష్కారం అయ్యి అన్యోన్యత ఏర్పడుతుంది.
  3. ధను రాశి: ఈ రాశి వారికి మూడవ స్థానం నుంచి ఏడవ స్థానం వరకు గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి వీరికి ఎన్నడూ ఊహించని అదృష్టాన్ని తప్పకుండా కలగజేస్తుంది అని చెప్పవచ్చు. చిన్న ప్రయత్నంతో కొద్దిపాటి ప్రణాళికతో ఈ రాశి వారు జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పడానికి అవకాశం ఉంటుంది. ఆస్తి వివాదాలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆస్తి విలువ గణనీయంగా పెరుగుతుంది. కొత్తగా ఆస్తులని కొనుగోలు చేయడం జరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంతానయోగం కలుగుతుంది. జీవిత భాగస్వామికి సమాజంలో ఒక చక్కని గుర్తింపు లభించి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవితంలో ఇక దేనికీ లోటు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.
  4. మకర రాశి: ఈ రాశి వారికి రెండవ స్థానం నుంచి ఆరవ స్థానం వరకు గ్రహాలు వరుస కట్టడం ఒక మంచి అదృష్ట యోగమని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడటం ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, ఆదాయ మార్గాలు పెరగటం, దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కోలుకోవడం, వీరి పట్ల ఇతరులకు ముఖ్యంగా అధికారులకు, యాజమాన్యాలకు ఉన్న దురభిప్రాయాలు తొలగిపోవడం, సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి పెరగటం ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటం, వృత్తి వ్యాపారాలు విశేషంగా పురోగతి చెందడం వంటివి తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి. చాలాకాలంగా మనసులో ఉన్న ఒకటి రెండు కోరికలు లేదా ఆశయాలు తప్పకుండా నెరవేరటం జరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..