Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Astrology 2025: నాలుగు గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం..!

జ్యోతిష్య శాస్త్రం మేరకు శని గ్రహాన్ని (Lord Shani Dev) ఉద్యోగ కారకుడిగా పరిగణిస్తారు. శని గ్రహ సంచారంతో పాటు మరో మూడు శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి, ఉద్యోగంలో పదోన్నతులు ఆశిస్తున్నవారికి కూడా మార్చి 29లోగా పెనుమార్పులు సంభవించే సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రాశులవారికి వచ్చే రెండు నెలల కాలంలో తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

Job Astrology 2025: నాలుగు గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం..!
Job Astrology 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 31, 2025 | 4:21 PM

మూడు శుభ గ్రహాలతో పాటు ఉద్యోగ కారకుడు శని సంచారం కూడా అనుకూలంగా ఉన్నందు వల్ల ఆరు రాశుల వారికి కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి, ఉద్యోగంలో పదోన్నతులు ఆశిస్తున్నవారికి కూడా మార్చి 29లోగా పెనుమార్పులు సంభవించే సూచనలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రాశులవారికి వచ్చే రెండు నెలల కాలంలో తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, మకర రాశుల వారికి గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది.

  1. మేషం: దశమ స్థానాధిపతి, ఉద్యోగు కారకుడైన శని మరో రెండు నెలల పాటు లాభ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుం టాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మారదలచుకున్నవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగుల కల నెరవేరుతుంది.
  2. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో దశమాధిపతి శనీశ్వరుడి సంచారం మరో రెండు నెలల్లో ముగియ బోతోంది. ఈ రాశికి ఈ రెండు నెలల కాలంలో తప్పకుండా ఉద్యోగంలో శుభ పరిణామాలు సంభ వించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఇతర ఊర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సొంత ఊరికి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభించవచ్చు. ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది.
  3. మిథునం: ఉద్యోగ కారకుడు శని భాగ్య స్థానంలో, ఉద్యోగ స్థానాధిపతి గురువు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులే కాక, ఉద్యోగులు కూడా ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అత్యధిక ధన లాభం కలుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి షష్ట స్థానంలో శనీశ్వరుడు, భాగ్య స్థానంలో గురువు, దశమంలో కుజ సంచారం వల్ల విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారు విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడంతో పాటు అక్కడే స్థిరపడడం కూడా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమీప భవిష్యత్తులో తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభించడం, జీతభత్యాలు పెరగడం వంటివి జరుగుతాయి.
  5. తుల: ఈ రాశికి శని, గురువులు అనుకూలంగా మారినందువల్ల ఉద్యోగంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సంతృప్తికరంగా నెరవేరు తుంది. ఈ రాశివారికి సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం, పదోన్నతి వంటివి లభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ప్రభుత్వంలో ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు.
  6. మకరం: ఈ రాశికి దశమాధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో అధికార యోగం కలిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో లేదా విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఉద్యోగరీత్యా ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా ఒక వెలుగు వెలుగుతాయి.