- Telugu News Photo Gallery Spiritual photos Monthly Horoscope for February 2025: Check astrological predictions for your zodiac sign
Feb 2025 Horoscope: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
మాస ఫలాలు (ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు): మేష రాశి వారికి ఈ నెలలో ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ నెలలో అనేక పర్యాయాలు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయం దిన దినా భివృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఫిబ్రవరి మాసఫలాలు (Monthly Horoscope for February 2025) ఎలా ఉన్నాయంటే..
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Jan 31, 2025 | 5:27 PM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశికి ఈ నెలంతా శని, బుధ, రవి, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడంతో పాటు రాశ్యధిపతి కుజుడు తృతీయంలో అనుకూల సంచారం చేస్తుండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగ, ఆదాయ ప్రయత్నాలు ఊహించని సత్ఫలితాలనిస్తాయి. మొత్తం మీద ఈ రాశివారికి ఈ నెలంతా చీకూ చింతా లేకుండా గడిచి పోతుంది. సుఖ సంతోషాలు, ఆధునిక సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాలు కూడా లాభాల బాటపడతాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. తల్లితండ్రుల నుంచి సహాయం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశినాథుడు శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ పట్టడంతో పాటు గురువుతో పరివర్తన చెందినందు వల్ల ఈ నెలలో అనేక పర్యాయాలు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆదాయం దిన దినా భివృద్ధి చెందుతుంది. దశమంలో ఉన్న శని వల్ల ఉద్యోగపరంగా కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధు మిత్రుల వల్ల కొద్దిగా కష్టనష్టాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ధన స్థానంలో వక్ర కుజుడి సంచారం వల్ల అనుకోని ఖర్చులు మీద పడడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ వార్తలు వింటారు. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ లాభాలు ఎక్కువగా ఉంటాయి. నిరు ద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): అష్టమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం, దశమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వంటి కారణాల వల్ల ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. అధికారులకు బాగా సన్నిహితం అవుతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కెరీర్ తో పాటు కుటుంబ జీవితం కూడా నిశ్చింతగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగవుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎక్కువగా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు రావడం, విదేశీ సంబంధాలు కుదిరే అవకాశముంది. ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లల నుంచి ఎక్కువగా శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, లాభ స్థానంలో గురువు ఉండడం, గురు, శుక్రుల మధ్య పరివర్తన జరగడం వంటి కారణాల వల్ల నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి, ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు ఘన విజ యం సాధిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ సునాయాసంగా పూర్తయి మానసికంగా ఊరట లభి స్తుంది. ఆర్థికంగా ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా పలుకుబడి బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. ఉద్యో గంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్ని హిత్యం పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి, బుధుడు, లాభ స్థానంలో కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ఫలితం, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థికంగా కొద్దిగా కలిసి వస్తుంది. శత్రు వులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. కొద్దిగా ఆలస్యంగానే అయినా ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఎటు వంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూ లంగా సాగిపోతాయి. తల్లితండ్రుల నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయంగా ప్రాబల్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం సామరస్యంగా, సానుకూలంగా సాగిపో తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): పంచమ స్థానంలో రవి, బుధులు, షష్ట స్థానంలో శని, సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, భాగ్య స్థానంలో గురు సంచారం వల్ల ఈ నెలంతా దాదాపు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపో తుంది. ఆర్థికంగా బాగా బలం పుంజుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరు గుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవ కాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో డిమాండ్ బాగా వృద్ధి చెందుతుంది. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. కొద్దిగాఅనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు ఈ నెలంతా ఉచ్ఛ స్థితిలో ఉంటున్నందువల్ల ఇంటా బయటా మీ మాటకు తిరుగుండకపోవచ్చు. నెలంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాజ యోగాలు పడతాయి. ఈ రాశివారి సలహాలు, సూచనలతో పాటు, పనితీరు కూడా అధికారులకు సంతృప్తిని కలిగిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. వ్యాపారంలో భాగస్వాములతోనూ, వృత్తి, ఉద్యోగాల్లో సహచరులతోనూ కొద్దిగా అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా ధన లాభాలు కలుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): పంచమ, సప్తమాధిపతులైన గురు, శుక్రుల మధ్య పరివర్తన జరిగినందువల్ల అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోయి, ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెర వేరుతాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు, జీత భత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. మొత్తానికి నెలంతా సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. తృతీయ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడిన కారణంగా వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఉద్యోగం మారడానికి అవకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయి. వ్యాపారాలు కూడా లాభాల పరంగా నిలకడగా ముందుకు సాగుతాయి. వృత్తి జీవి తంలో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, వ్యయ ప్రయాస లుంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ధన స్థానంలో రవి బుధులు, తృతీయంలో శని, చతుర్థంలో ఉచ్ఛ శుక్రుడి వల్ల నెలంతా చాలా వరకు శుభవార్తలు, శుభ పరిణామాలతో సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ నెలలో ఈ రాశివారు కొన్ని కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. తప్పకుండా పదోన్నతులు లభిస్తాయి. సామాజికంగా కూడా ఆదరాభిమానాలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవాలు పెట్టుకో వద్దు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధనాధిపతి శని ధన స్థానంలోనే ఉండడం, దశమాధిపతి శుక్రుడు ఉచ్ఛపట్టడం, శుక్ర, గురువుల మధ్య పరివర్తన జరగడం వల్ల నెలంతా బాగా అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థి కంగా బాగా మెరుగైన స్థితిలో ఉంటారు. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగి నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపో తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారసత్వ సంపద లభించే అవకాశం కూడా ఉంటుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. సన్నిహితుల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అనవసర పరిచ యాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు బాగా సానుకూలంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గురు, శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోయి, జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో పాటు ఇంటా బయటాకూడా పలువురు లబ్ది పొందుతారు. మొత్తం మీద నెలంతా ఉత్సాహంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రధానంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగ్గా ఉంటుంది. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల తప్ప కుండా లాభం పొందుతారు. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి. బంధువులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): తృతీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువుతో శుక్రుడు పరివర్తన చెందడం వల్ల నెలంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఆదాయ, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. చతుర్థంలో ఉన్న వక్ర కుజుడి వల్ల మధ్య మధ్య మాన సిక ఒత్తిడి, మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో అనేక రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుం టారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఇంటా బయటా ఆశించిన గుర్తింపు ఏర్పడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినడా నికి ఆస్కారముంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.





























