- Telugu News Photo Gallery Spiritual photos Lucky Horoscope 2025: These zodiac signs to get lucky in feb 2025 due to ketu impact details in telugu
Lucky Zodiac Signs: ఫిబ్రవరిలో కేతువుతో శుభాలు.. ఆ రాశుల వారికి అదృష్ట యోగాలు..!
Lucky Zodiac Signs in February 2025: కన్యా రాశిలో మే 18వరకూ సంచరించబోతున్న కేతు గ్రహం మీద ప్రస్తుతం ఉచ్ఛ శుక్రుడు, భాగ్య గురువు, దశమ కుజుడి దృష్టులు పడడం జరిగింది. ఈ మూడు గ్రహాల దృష్టి వల్ల కేతు గ్రహం తన పాపత్వాన్ని వదిలిపెట్టి ఎక్కువగా శుభాలనే ఇవ్వడం జరుగుతుంది. ఛాయా గ్రహం, వక్ర గ్రహం అనే పేర్లున్న కేతువు ఫిబ్రవరి నెలంతా వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభ రాశులకు అత్యధికంగా యోగాలను, లాభాలను కలిగించే అవకాశం ఉంది.
Updated on: Jan 30, 2025 | 6:42 PM

వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న కేతువు మీద శుభ గ్రహాల దృష్టి పడినందువల్ల వృత్తి, ఉద్యో గాల్లోనే కాక, సామాజికంగా, ప్రభుత్వపరంగా కూడా మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతికి, ముఖ్యంగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా లాభాల బాటపడ తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో అరుదైన అవకాశాలు కలుగుతాయి. ఆదాయానికి లోటుండదు.

మిథునం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న కేతువు శుభ గ్రహాల దృష్టి వల్ల శుభ గ్రహంగా మారినందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది.

కన్య: ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతువు మీద శుభ గ్రహాల దృష్టి పడినందువల్ల ఈ రాశివారి ప్రాభవం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మనసులోని కోరికలు కొన్ని తప్పకుండా నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.

తుల: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న కేతువు శుభుడుగా మారినందువల్ల ఈ రాశివారికి విదేశీ అవ కాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కలుగు తుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి.

మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న కేతువు మీద శుక్ర, గురు, కుజుల దృష్టి పడడం వల్ల అనేక రకా లుగా అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు క్రమంగా బలం పుంజుకుంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు శుభవార్తలు వింటారు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్న కేతువు మీద గురు, శుక్రుల దృష్టి పడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసివస్తాయి. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. జీవిత భాగ స్వామికి కూడా ధన యోగాలు కలుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు.



