Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రుడు మకర రాశిలోకి..! ఈ రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన లాభాలు..!

2025 జనవరి చివరిలో జరిగిన అద్భుతం గురించి మీకు తెలుసా.. ఒక రాశి మార్పు వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి వచ్చింది. ఈ అద్భుతంతో మీ అభివృద్ధిని అడ్డుకోవడం కష్టమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఆ రాశి మార్పు వల్ల జరిగే అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రుడు మకర రాశిలోకి..! ఈ రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన లాభాలు..!
Zodiac Signs
Follow us
Prashanthi V

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 30, 2025 | 10:19 PM

జనవరి నెల చివరిలో చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశి మార్పు వల్ల మూడు రాశులకు అనుకూలంగా ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు ఎంతో ముఖ్యమైన గ్రహం. ఈ గ్రహం ఆనందం, ధనం, మనసుకు సంబంధించినది. ఇతర గ్రహాల కంటే చంద్రుడు వేగంగా రాశి మార్పు చేస్తాడు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. 2025 జనవరి 28న మధ్యాహ్నం 2:51 గంటలకు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశి మార్పు వల్ల మూడు రాశుల జీవితాలను మార్చనుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి వివాహ విషయాలలో సానుకూల మార్పులు సంభవించే అవకాశం ఉంది. చంద్రుని దయతో చాలా కాలంగా ఆగిపోయిన పనులు నెరవేరుతాయి. గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మనస్సు ఆనందంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యం నుండి ఆర్థిక లాభం చేకూరుతుంది. దీని వలన వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో ప్రేమ నెలకొంటుంది. ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 50 ఏళ్ళ పైబడ్డ వారికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

కర్కాటక రాశి

వృషభ రాశినే కాకుండా.. చంద్ర సంచారంతో శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి కూడా వచ్చాయి. ఖర్చులను నియంత్రించడం ద్వారా ఉద్యోగం చేసే వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల జాతకంలో ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. గత సంవత్సరం ఎవరికైనా అప్పు ఇస్తే, ఆ డబ్బు మీకు త్వరలో తిరిగి వస్తుంది. వైవాహిక జీవితంలో జరుగుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారం విస్తరిస్తాయి.

మిథున రాశి

చంద్రుడి ప్రత్యేక అనుగ్రహంతో మిథున రాశి వారికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు ఇచ్చి రాకుండా ఉన్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. దీంతో మానసిక ప్రశాంతి లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. విదేశాలకు వెళ్లే ప్లాన్ చేయవచ్చు. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం పెళ్లి ఖాయం కావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.