Shani jayanti 2025: శని జయంతి నుంచి ఈ 4 రాశులవారు అదృష్టవంతులు.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
శని జయంతిని పురస్కరించుకుని.. ఈ పవిత్రమైన రోజున ఆయనను పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. శనిదేవుడి స్థానం జ్యోతిషశాస్త్రంలో గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శ్రేయస్సు, సంతోషాన్ని కలిగేందుకు ఆశీర్వాదాలను కోరుతూ శనీశ్వరుడి ఆనందం కోసం పుజాధికార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు కొన్ని రాశుల వారికీ అదృష్టాన్ని తీసుకోస్తుందట.

2025 శని జయంతి పండగను వైశాఖ మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది మంగళవారం, మే 27న వచ్చింది. ఈ రోజంతా శుభప్రదమైన ‘సుకర్మ’ యోగం ఉండనుంది. ఈ రోజు వైశాఖ మాసం అమావాస్య తిధి, మంగళవారం.. దీంతో ఈ రోజు ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఈ రోజు నుంచి శనిశ్వరుడి అనుగ్రహంతో నాలుగు రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..
వృషభ రాశి: వృషభ రాశి అధిపతి శుక్రుడు. శనీశ్వరుడికి స్నేహితుడు. వృషభ రాశి వారి జీవితాల్లోకి అకస్మాత్తుగా ఆనందం, సంతోషం ప్రవేశించవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. గత పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. ప్రేమికుల జీవితంలో విజయం లభించనుంది. బ్యాంకులో నగదు నిల్వలు అకస్మాత్తుగా పెరగవచ్చు.
కన్యారాశి: కన్యా రాశిని శనీశ్వరుడికి మరో స్నేహితుడైన బుధుడు పాలిస్తాడు. కన్యా రాశి వారు తరచుగా శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రాశి వారికి శని జయంతి శుభదినంగా చెప్పవచ్చు. ఉద్యోగ, వ్యాపార అవకాశాలు అనుకూలంగా కనిపిస్తాయి. పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నత పదవులు సాధించవచ్చు. ఈ రాశికి చెందిన తల్లిదండ్రులకు పిల్లల వల్ల ఆనందం లభిస్తుంది.
మకర రాశి: మకర రాశిని శనీశ్వరుడు స్వయంగా పాలిస్తాడు. ఈ రాశి వారికి ఇటీవల ఏలి నాటి శని ముగిసినందున జీవితం చాలా సంతోషంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆస్తి నుంచి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది శుభ సమయం. వివాహాలు లేదా నిశ్చితార్థాలు వంటి శుభ కుటుంబ కార్యక్రమాలు సాధ్యమే. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
కుంభ రాశి: కుంభ రాశి వారికి చంద్రుడు అధిపతి. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలి నాటి శని చివరి దశ జరుగుతోంది. దీంతో శని జయంతి నుంచి వీరికి అనుకూలమైన ఫలితాలు లబిస్తాయని భావిస్తున్నారు. విద్యార్థులకు ఇది మంచి సమయం. పెళ్ళికాని యువతీ యువకులకు వివాహాలు కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. అదనపు ఆదాయానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి లాభాలు అందుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








