Personality Test: చేతులు ముడుచుకుని నిలబడే భంగిమే మీరు ఎలాంటివారో చెబుతోంది..
మన శరీర ఆకృతి ద్వారానే కాదు అవయవాల తీరుతో కూడా మీలో దాగున్న లక్షణాలు తెలియజేస్తాయి. మీరు చేతులు ముడుచుకుని నిలబడే విధానం ద్వారా మీలో మీకు తెలియని మన దాగి ఉన్న లక్షణాలను , వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని మీకు తెలుసా? మీరు కూడా ఈ విధంగా మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించుకోవచ్చు. మీరు చేతులు కట్టుకుని నిలబడే విధానం మీరు స్వార్థపరులా లేక వినయంగా ఉండే వ్యక్తులా అనే విషయం తెలుస్తుంది.

సాధారణంగా అందరికీ చేతులు ముడుచుకుని నిలబడే అలవాటు ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేతులు కట్టుకుని నిలబడతారు లేదా కూర్చుంటారు. చేతులు కట్టుకుని నిలబడే భంగిమ ద్వారా కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని పరీక్షించవచ్చని తెలుసా.. అవును, సాముద్రిక శాస్త్రం, ఆప్టికల్ భ్రాంతి చిత్రాలు , శరీర ఆకృతి ద్వారా మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నట్లే.. మీరు చేతులు కట్టుకుని నిలబడే విధానం ద్వారా కూడా మీలో దాగి ఉన్న మర్మమైన స్వభావాన్ని కూడా తెలుసుకోవచ్చు. మీరు చేతులు ముడుచుకుని నిలబడే తీరు మీరు స్వార్థపరులో లేదా వినయంగా ఉండే వ్యక్తులో తెలియజేస్తుంది.
ఈ ప్రత్యేకమైన వ్యక్తిత్వ పరీక్ష అనేది ఒక సరదా ఆట. దీనిని okdiario.com పేజీలో షేర్ చేయబడింది. దీనిలో మీరు ప్రశాంతంగా ఉన్నారా? దృఢ నిశ్చయంతో ఉన్నారా లేదా సమస్యలను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారా అనేది మీరు చేతులు ముడుచుకుని నిలబడటం ద్వారా పరీక్షించుకోవచ్చు.
ఆప్షన్ 1: ఆప్షన్ ఒకటిలో చూపిన విధంగా మీ కుడి చేతితో ఎడమ చేయి పట్టుకుని నిలబడే అలవాటు మీకు ఉంటే.. మీరు సామరస్యం, శాంతికి విలువనిచ్చే వ్యక్తి అని అర్థం. మీరు ఇతరులతో చాలా వినయంగా ప్రవర్తిస్తారు. మీరు చాలా ప్రశాంతమైన వ్యక్తి. విభేదాలను లేదా వాదనలను ఇష్టపడరు. ఎప్పుడైనా గొడవలు జరిగినప్పుడు.. వీరు న్యాయమైన పరిష్కారాన్ని కోరుకుంటారు. మొత్తం మీద వీరు చుట్టూ ఉన్నవారిని కూడా ప్రశాంతంగా ఉండేలా చూస్తారు.
ఆప్షన్ 2: రెండవ ఎంపికలో చూపిన విధంగా.. మీ కుడి చేతిని మీ ఎడమ చేతిపై ముడుచుకుని నిలబడే అలవాటు మీకు ఉంటే.. మీరు బలమైన దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి అని అర్థం. మీరు ఎంత కష్టతరమైనా, వీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. వీరి ఈ సంకల్ప శక్తి వీరిని లక్ష్యంవైపు పయనించేలా చేస్తుంది. వీరి స్వభావం కొన్నిసార్లు మొండిగా అనిపించవచ్చు. అయితే వీరు అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కనుక ప్రజలు వీరిని స్వార్థపరులుగా భావిస్తారు. అయినప్పటికీ వీరి దృఢ సంకల్పం ఇతరులకు స్ఫూర్తినిస్తుందని చెప్పవచ్చు.
ఆప్షన్ 3: పై చిత్రంలో మూడవ ఎంపికలో చూపిన విధంగా మీరు చేతులు ముడుచుకుని నిలబడే అలవాటు కలిగి ఉంటే.. మీరు ఒత్తిడిని నిర్వహించడానికి ఇబ్బంది పడుతున్నారని అర్థం. అవును ఒత్తిడిని ఎదుర్కోవడం.. సమస్యలను సమర్థవంతంగా నిర్వహించడం వీరికి కష్టంగా అనిపించవచ్చు. వీరు వ్యక్తిగత సమస్యలపై దృష్టి సారిస్తారు. కనుక ఇతరుల పట్ల కరుణతో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంటుంది. వీరు తరచుగా నిరాశకు లోనవుతారు. కోపంగా కూడా ఉంటారు. కనుక వీరు భావోద్వేగాలను నిర్వహించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








