రాహువు ఏ స్థానంలో ఉంటే కోటీశ్వరులు అవుతారో తెలుసా?
జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహానికి ప్రత్యక ప్రాముఖ్యత ఉంది. దీనిని పాప గ్రహంగా పరిగణిస్తారు. ఇక ఇది జాతకంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఉండే స్థానం బట్టి ఆ వ్యక్తి భవిష్యత్తు ఉంటుందిని చెబుతుంటారు. అయితే రాహువు ఒక స్థానంలో ఉంటే ఆ వ్యక్తి కోటీశ్వరులు అవుతారంట. కాగా, రాహువు ఏ రాశిలో ఉంటే కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: May 26, 2025 | 8:37 PM

కొంత మంది వ్యక్తులు ఎప్పుడూ నష్టాలు, కష్టాల్లో మునిగి పోతుంటారు. మరికొంత మంది మాత్రం ఉన్నట్లుండే ధనవంతులు అవుతారు. కట్టల కొద్ది డబ్బులు చేతికదడంతో అష్టఐశ్వర్యాలతో తులతూగుతారు. అయితే దీనికి ముఖ్య కారణం రాహువేనంట.

రాహువు గ్రహాన్ని పాప గ్రహంగా పరిగణిస్తారు. అంతే కాకుండా దీనిని నీడ గ్రహంగ కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ గ్రహం శుభ స్థానంలో ఉంటే అదృష్టం కలిసి వస్తంది. అలాగే చెడు స్థానంలో ఉంటే నష్టాలు కష్టాలు ఎక్కువ అవుతాయంట.

రాహువు నీచ స్థానంలో ఉంటే జూదం ఆడటం, జీవితంలో గందరగోళ పరిస్థితులు ఎదురు అవుతాయంట. ఏ పని చేసినా అందులో కలిసి రాదంట. అంతే కాకుండా ఖర్చులు అధికం అయిపోయి, అప్పుల పాలవుతారంటున్నార పండితులు.

ముఖ్యంగా రాహువు ధనస్సు రాశిలో ఉంటే నీచ స్థానంలో ఉన్నట్లు అంట. ఎవరి జాతకంలోనైతే రాహువు నీచ స్థానంలో ఉంటాడో, వారు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలతో సతమతం అవుతారంట. అంతే కాకుండా చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది.

ఇక రాహువు మిథున రాశిలో ఉంటే ఉన్నత స్థానంలో ఉన్నట్లంట. దీని వలన ఏ పని చేసినా కలిసి వస్తుందంట. రాహువు ఉన్నత స్థానంలో ఉంటే ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు పండితులు.



