Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Gochar 2025: ఈ నెల 29 రాశిని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ రాశులకు ఏలినాటి శని ప్రారంభం.. వీరికి అగ్ని పరీక్షే..

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో శనీశ్వరుడు మంద గమనుడు. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. కర్మ ఫలదాత శనీశ్వరుడు 2025 సంవత్సరంలో తన రాశిని మార్చుకోనున్నాడు. శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జ్యోతిష్యం ప్రకారం చాలా ముఖ్యమైనది. శనీశ్వరుడి సంచారం వలన మొత్తం 12 రాశులు ప్రభావితమవుతాయి. ఈ సమయంలో కొన్ని రాశులపై శనీశ్వరుడు అనుగ్రహం కురిపిస్తాడు.. అయితే కొన్ని రాశులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Shani Gochar 2025: ఈ నెల 29 రాశిని మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ రాశులకు ఏలినాటి శని ప్రారంభం.. వీరికి అగ్ని పరీక్షే..
Shani Gochar In New Year 2025
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2025 | 5:29 PM

హిందూ పురాణ గ్రంథాలలో.. సూర్యుడు ఛాయల తనయుడు శనీశ్వరుడు.. నవగ్రహాలలో ఒకడు. ఈ శనిశ్వరుడిని న్యాయాధిపతి అని పిలుస్తారు. మంచి చెడుల కర్మలను అనుసరించి ఫలితాలను ఇస్తాడు అని నమ్మకం. అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహం.. శనీశ్వరుడు. ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. అలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అత్యంత నెమ్మదిగా సంచరిస్తాడు. ఇప్పుడు 2025 సంవత్సరంలో, శనీశ్వరుడు తన రాశిని మార్చబోతున్నాడు. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 2025 నెలలో అతను కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు.

శనీశ్వరుడు మార్చి 29వ తేదీ 2025 రాశిని మార్చుకొనున్నాడు. మార్చి 29న శని దేవుడు కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శని దేవుడి ఈ రాశి మార్పు ప్రభావం మొత్తం 12 రాశులపై భిన్నంగా పడనుంది. ఈ సమయంలో కొన్ని రాశికు చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మేషరాశి: జ్యోతిషశాస్త్రంలో మేషరాశి మొదటి రాశిగా పరిగణించబడుతుంది. శనీశ్వరుడు ప్రస్తుతం సంచరిస్తున్న కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో శనీశ్వరుడు ప్రభావం మేష రాశికి చెందిన వ్యక్తులపై పడనుంది. ఏలి నాటి శని ఈ మేష రాశి వారికి ప్రారంభమవుతుంది. ఈ కారణంగా మార్చి 29 తర్వాత మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025 సంవత్సరం మేష రాశి వారికి కష్టంగా, ఇబ్బందికరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు సొంత రాశి సింహ రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులపై కూడా శనీశ్వరుడు రాశి మార్పు ప్రభావం చూపిస్తుంది. ఏలి నాటి శని ప్రభావంతో తీవ్ర కష్ట నష్టాల బారిన పడతారు. మార్చి 29 నుంచి సింహ రాశికి చెందిన వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలతో సహా ప్రతి రంగాలకు చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్ధిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు రాశి: శని దేవుడి రాశిలో మార్పు ధనుస్సు రాశి వారిపై కూడా ప్రభావం చూపుతుంది. శని దేవుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ధనుస్సు రాశి వారిపై ఎలి నాటి శని ప్రభావం పడుతుంది. ఈ కారణంగా, మార్చి 29 నుండి ధనుస్సు రాశికి సంబంధించిన వ్యక్తులు అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి వీరు అగ్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

శని ప్రభావం నుంచి నివారణ కోసం

శనీశ్వరుడు చెడు ప్రభావాలను నివారించడానికి మేషం, సింహ, ధనుస్సు రాశుల వారు ఎటువంటి తప్పు చేయకూడదు. ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు. చెడు పనులు తలపెట్టకూడదు. శనీశ్వరుడుకి సంబంధించిన వస్తువులను దానం చేయండి. శనివారం శనిదేవుని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. రావి చెట్టును పూజించండి. శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనివారం రోజున నల్ల కుక్కకు రొట్టె తినిపించండి. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తో హీటెక్కించారుగా
GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తో హీటెక్కించారుగా
ఈ మొక్కను ముట్టుకుంటే నాశనం తప్పదు.. ప్రపంచంలోనే డేంజరస్ ప్లాంట్
ఈ మొక్కను ముట్టుకుంటే నాశనం తప్పదు.. ప్రపంచంలోనే డేంజరస్ ప్లాంట్
'నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు'.. హార్దిక్ మాజీ భార్య నటాషా
'నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు'.. హార్దిక్ మాజీ భార్య నటాషా
ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
క్రికెటర్ డేవిడ్ వార్నర్‏తో మై డాక్టర్ భాగస్వామ్యం..
క్రికెటర్ డేవిడ్ వార్నర్‏తో మై డాక్టర్ భాగస్వామ్యం..
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే