Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturn Trasit 2025: విశ్వావసులో శని రాశి మార్పుతో వారికి అన్ని శుభాలే.. ఆ రాశుల వారు జాగ్రత్త..!

Saturn in Pisces 2025: 2025 మార్చి 29న శనిదేవుడు కుంభం నుండి మీనరాశికి మారుతున్నాడు. ఈ మార్పు 12 రాశులపై విభిన్న ప్రభావాలను చూపుతుంది. కొన్ని రాశులకు శుభ ఫలితాలు, మరికొన్నింటికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏలిన శని, అష్టమ శని వంటి దోషాల ప్రభావం, శనికి పరిహారాలు ఇక్కడ వివరించబడ్డాయి. ప్రతి రాశి వారిపై శని రాశి మార్పు ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.

Saturn Trasit 2025: విశ్వావసులో శని రాశి మార్పుతో వారికి అన్ని శుభాలే.. ఆ రాశుల వారు జాగ్రత్త..!
Saturn Transit 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 28, 2025 | 5:42 PM

Shani Gochar 2025: మార్చి 29 రాత్రి 9.45 ప్రాంతంలో శనీశ్వరుడు తన స్వస్థానమైన కుంభ రాశి నుంచి గురు స్థానమైన మీన రాశిలోకి మారడం జరుగుతోంది. మీన రాశిలో శని రెండున్నరేళ్ల పాటు సంచారం చేస్తాడు. జ్యోతిషశాస్త్రపరంగా శని రాశి మార్పునకు అత్యంత ప్రాధాన్యం ఉంది. శని రాశి మార డాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శనీశ్వరుడికి పూజలు చేయడం కూడా జరుగుతుంటుంది. అందరూ అత్యధికంగా భయపడే శని ఆధ్యాత్మిక రాశి, గురు రాశి అయిన మీనరాశిలోకి మారడం వల్ల అనుకూల రాశులకు శుభ ఫలితాలను ఎక్కువగానూ, ప్రతికూల రాశులకు మిశ్రమంగానూ మాత్రమే దుష్ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. శని రాశి మార్పు ఫలితాలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందీ ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశికి 12వ స్థానంలో శనీశ్వరుడి ప్రవేశం వల్ల వీరికి ఏలిన్నాటి శని ప్రారంభం అవుతోంది. దీనివల్ల సుమారు రెండున్నరేళ్ల పాటు ఈ రాశివారికి ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. తరచూ అనారోగ్యాలతో బాధపడాల్సి వస్తుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం తగ్గడం వంటివి జరుగుతాయి. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన నెరవేరదు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఇబ్బందులు పడాల్సివస్తుంది.
  2. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శని ప్రవేశం వల్ల మార్చి 29 తర్వాత నుంచి వీరి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో ఆగిపోయిన పదోన్నతులు , జీతభత్యాల పెరుగుదల వంటివి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో స్తబ్ధత తొలగిపోయి, బాగా బిజీ అయిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీయానానికి, విదేశాల్లో స్థిరత్వానికి సంబంధించిన సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి.
  3. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శనీశ్వరుడి ప్రవేశం వల్ల ఉద్యోగ జీవితం శుభ పరిణామాలతో సాగి పోతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఇతర దేశాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం దిన దినాభివృద్ది చెందే అవకాశం ఉంది.
  4. కర్కాటకం: ఈ రాశికి అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోయి, కొత్త జీవితం ప్రారంభమవుతుంది. శని భాగ్య స్థానంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. దాదాపు పట్టిం దల్లా బంగారం అవుతుంది. అనేక సమస్యలు, ఒత్తిళ్ల బయటపడడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. పితృవర్గం నుంచి ఆస్తి బాగా కలిసి వస్తుంది.
  5. సింహం: శని రాశి మార్పుతో ఈ రాశికి అష్టమ శని దోషం ప్రారంభం అవుతోంది. దీనివల్ల ఊహించని ‘అష్టకష్టాలు’ పడడం జరుగుతుంది. రావలసిన డబ్బు అందకపోవడం, ఆదాయం పెరగకపోవడం, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడం, శ్రమ పెరగడమే తప్ప ఫలితం లేకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
  6. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని ప్రవేశం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించక నిరాశకు గురవుతారు. వ్యాపారాల్లో భాగ స్వాములతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. పెండింగ్ పనులు పెరిగిపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నమూ సానుకూలపడదు. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనూ ఆశించిన పురోగతి ఉండదు.
  7. తుల: ఈ రాశికి శనీశ్వరుడు ఆరవ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారి జీవితం రెండున్నరేళ్ల పాటు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. అనేక విధాలుగా అదృష్టం పడుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక సమ స్యల నుంచి పూర్తిగా బయటపడతారు. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభాల పంట పండిస్తాయి.
  8. వృశ్చికం: ఈ రాశికి శని రాశి మార్పుతో అర్ధాష్టమ శని తొలగిపోతుంది. పంచమ స్థానంలో శని ప్రవేశం వల్ల ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు దాదాపు పూర్తిగా విజయవంతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్దిలోకి వస్తారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  9. ధనుస్సు: ఈ రాశికి మార్చి 29 నుంచి అర్దాష్టమ శని ప్రారంభం అవుతోంది. దీనివల్ల అన్ని విషయాల్లోనూ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆస్తి వివాదాలు ఒక పట్టాన పరిష్కారం కావు. సొంత ఇంటి ప్రయత్నాల్లో ఇబ్బందులుంటాయి. ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది.
  10. మకరం: ఈ రాశికి శని తృతీయ స్థానానికి మారుతున్నందువల్ల ఏలిన్నాటి శని దోషం నుంచి విముక్తి లభి స్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుంది. రెండున్నరేళ్ల పాటు జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  11. కుంభం: ఈ రాశికి శని ధన స్థానంలోకి ప్రవేశించడంతో మూడవ దశ ఏలిన్నాటి శని ప్రారంభం కాబోతోంది. దీనివల్ల ఆదాయం తగ్గడం, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉండడం, రావలసిన డబ్బు రాకపో వడం, కష్టార్జితం ఎక్కువగా వృథా కావడం, డబ్బు తీసుకున్నవారు ఇవ్వకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఆగిపోవడం, వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగడం వంటివి జరిగే అవకాశం ఉంది.
  12. మీనం: ఈ రాశిలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి రెండవ దశ ఏలిన్నాటి శని ప్రారంభం అవుతోంది. దీనివల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితం ఉండకపోవచ్చు. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యాలతో అవస్థలు పడాల్సి వస్తుంది. ప్రతి ప్రయత్నంలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి.

ముఖ్యమైన పరిహారాలు: శని అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా తప్పకుండా శనీశ్వరుడికి తరచూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శని దుష్ప్రభావం తగ్గడం జరుగుతుంది. ప్రతికూలంగా ఉన్న వారు ప్రతి శనివారం శివార్చన చేయించడం వల్ల శని దోషాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. శనిని ఏ విధంగా దూషించినా శని బలం పెరుగుతుంది. శనికి పొగడ్తలంటే ఎంతో ప్రీతి. శని ప్రభావంలో ఉన్నవారు, శని దోషంతో అవస్థలు పడుతున్నవారు తరచుగా శనికి దీపం వెలిగించడం మంచిది. నల్లరంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల కూడా శని సంతృప్తి చెందడం, శాంతించడం జరుగుతుంది. వీలైతే పేదలకు, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. తిలాదానం చేయడం, శనీశ్వరుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది.