AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shat Graha Kutami : షష్టగ్రహ కూటమి ప్రభావం… ఈ రాశుల వారికి తీవ్ర పరిణామాలు

శుక్రవారం మయన్మార్‌ను, థాయ్‌లాండ్‌ను కుదిపేసిన భారీ భూకంపానికి కారణం ఏంటి? షష్ట గ్రహ కూటమా? అవుననే అంటున్నారు జ్యోతిష్య పండితులు. మరో మూడు నెలల పాటు ఇలాంటివి మరిన్ని సంభవించే అవకాశం ఉందంటున్నారు. ప్రకృతి ఉపద్రవాలతో పాటు...యూరప్‌ని యుద్ధ భయాలు కుదిపేస్తాయని వాళ్లు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? అదెప్పుడు ఏర్పడుతుందో తెలుసుకుందాం...

Shat Graha Kutami : షష్టగ్రహ కూటమి ప్రభావం... ఈ రాశుల వారికి తీవ్ర పరిణామాలు
Shat Graha Kutami
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 28, 2025 | 7:13 PM

మార్చి 29, శనివారం అమావాస్య యుక్త షష్ట గ్రహ కూటమి ఏర్పడుతోంది. దీంతో పాటు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది. మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని ఆరు గ్రహాలు సంయోగం చెందడం వల్ల షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం, 12 రాశుల వారిపై మే 31వ తేదీ వరకు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గతంలో 2019 డిసెంబర్ 25వ తేదీన షష్ట గ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించి విలయ తాండవం చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ శనివారం షష్ట గ్రహ కూటమి ఏర్పడుతోంది.

శనివారం… శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనికితోడు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. దీనివల్ల భూకంపాలు, సునామీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పశ్చిమ దేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అంటున్నారు జ్యోతిష్య పండితుడు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. మే 18 వరకు, సుమారు 3 నెలల పాటు విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. యూరప్‌లో యుద్ధ భయాలు అలుముకుంటాయన్నారు. షష్ట గ్రహ కూటమి ప్రభావం, కుంభం, మీనం, మేషం, సింహం, వృశ్చికం, ధనస్సు రాశులపై ఉంటుందని, వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితుడు చిలకమర్తి. వీరు ఉద్యోగ పరంగా, వ్యాపర పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే..