Money Horoscope: గ్రహాల అనుకూలతతో ఆ రాశుల వారికి శుభ యోగాలు.. వారికి డబ్బే డబ్బు..!
ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి కొన్ని రాశులకు కొన్ని గ్రహాలు శుభ ఫలితాలనివ్వడం, శుభ యోగాలు పట్టించడం జరుగుతోంది. ఈ గ్రహాల కదలికల మీద ఈ ఏడాది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మేషానికి కుజుడు, వృషభానికి బుధ, శుక్రులు, కర్కాటకానికి కుజుడు, సింహానికి రవి, తులా రాశికి శుక్రుడు, మకర రాశికి శనీశ్వరుడు అత్యంత శుభులుగా ఉన్నందువల్ల..

Money Astrology
ప్రస్తుత గ్రహ సంచారాన్ని బట్టి కొన్ని రాశులకు కొన్ని గ్రహాలు శుభ ఫలితాలనివ్వడం, శుభ యోగాలు పట్టించడం జరుగుతోంది. ఈ గ్రహాల కదలికల మీద ఈ ఏడాది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మేషానికి కుజుడు, వృషభానికి బుధ, శుక్రులు, కర్కాటకానికి కుజుడు, సింహానికి రవి, తులా రాశికి శుక్రుడు, మకర రాశికి శనీశ్వరుడు అత్యంత శుభులుగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి వీటివల్ల ఎంతగానో మేలు జరగబోతోంది. ఈ గ్రహాల కారకత్వాలు, ఆధిపత్యాలను బట్టి శుభ ఫలితాలు, శుభ యోగాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.
- మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల రుచక మహాపురుష యోగం ఏర్పడి, ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతంగా నెరవేరుతుంది. ఉద్యోగ జీవితంలో సరైన గుర్తింపు లభించి అందలాలకు ఎక్కడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. విదేశీయానానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
- వృషభం: ఈ రాశికి రాశ్యధిపతి శుక్రుడితో పాటు బుధుడు కూడా బాగా అనుకూలంగా ఉండడం జరుగు తోంది. ఫలితంగా ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు అంచనా లకు మించి విజయవంతం అవుతాయి. కలలో కూడా ఊహించని వ్యక్తిగత పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఇబ్బడిముబ్బడిగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ప్రస్తుతం దశమ స్థానంలో, స్వస్థానంలో సంచారం చేస్తు న్నందువల్ల ఉద్యోగ జీవితమే కాక, వృత్తి, వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి లేదా అధికార యోగానికి అవకాశం ఉంది. ఉద్యో గరీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
- సింహం: ఈ రాశికి అధిపతి అయిన రవి మరో నాలుగు నెలల పాటు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తు న్నందువల్ల, పైగా శుభ గ్రహాలతో కలిసి ఉన్నందువల్ల అన్ని విధాలు గానూ శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతితో పాటు ఆదాయంలో కూడా అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. ప్రభుత్వ మూలక ధన లాభం గానీ, ప్రభుత్వం తరఫున గుర్తింపు లభించడం గానీ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారి కలలు నెరవేరుతాయి.
- తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు అనుకూల రాశుల్లో సంచారం చేయడంతో పాటు బుధ, రవు లతో కలిసి ఉండడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వ్యాపారాల్లో ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు అంది వస్తాయి. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు ధనాధిపతిగా ధన స్థానంలోనే కొనసాగడం వల్ల ఈ రాశి వారికి ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ప్రభుత్వ మూలక ప్రయోజనాలుంటాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఆదాయం దిన దినాభివృద్ది చెందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.



