AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: శ్రమ తక్కువ.. సంపాదన ఎక్కువ! ఈ రాశుల వారి ఖజానా ఎప్పుడూ ఖాళీ అవ్వదు..

ప్రతి ఒక్కరూ సమాజంలో గొప్ప స్థాయికి చేరాలని, భారీ బ్యాంక్ బ్యాలెన్స్‌తో విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు. కానీ, కొందరికి మాత్రమే ఆ అదృష్టం చాలా సులువుగా దక్కుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి జీవిత గమనాన్ని శాసిస్తుంది. ముఖ్యంగా 9 సంఖ్యలలో '6'వ సంఖ్యకు ఉన్న పవర్ మరే నంబర్‌కు లేదు. ఈ సంఖ్య కింద జన్మించిన వారు కష్టపడకుండానే కీర్తి ప్రతిష్టలను, సిరిసంపదలను పొందుతారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Numerology: శ్రమ తక్కువ.. సంపాదన ఎక్కువ! ఈ రాశుల వారి ఖజానా ఎప్పుడూ ఖాళీ అవ్వదు..
Numerology Number 6 Benefits
Bhavani
|

Updated on: Feb 06, 2026 | 5:20 PM

Share

సంఖ్యాశాస్త్రంలో ‘6’వ సంఖ్యకు అధిపతి శుక్ర గ్రహం (Venus). శుక్రుడు అంటేనే ప్రేమ, అందం, కళలు విలాసానికి చిహ్నం. అందుకే ఈ సంఖ్యలో జన్మించిన వారు (ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు) సాధారణ జీవితాన్ని ఇష్టపడరు. ఖరీదైన కార్లు, బ్రాండెడ్ దుస్తులు, ఆధునిక వసతులు ఉన్న ఇళ్లు.. ఇవే వీరి ప్రపంచం. ఎంత ఖర్చు చేసినా వీరి దగ్గర డబ్బుకు లోటు ఉండకపోవడానికి కారణం శుక్రుని అపారమైన కృప ఉండటమే. ఈ ‘రాజయోగం’ కలిగిన వ్యక్తుల వ్యక్తిత్వంలోని ఆసక్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం.

నంబర్ 6 వ్యక్తుల 5 అద్భుత లక్షణాలు:

లగ్జరీ లైఫ్ స్టైల్: వీరికి నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడరు. చౌకైన వస్తువులను వీరు దరిచేరనివ్వరు. ప్రతిదీ బ్రాండెడ్ అయి ఉండాలని కోరుకుంటారు.

డబ్బును ఆస్వాదించడం: దాచుకోవడం కంటే ఖర్చు చేయడమే వీరికి తెలుసు. “జీవితం ఉన్నదే అనుభవించడానికి” అనే సూత్రాన్ని వీరు నమ్ముతారు. శుక్రుని దయ వల్ల వీరి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ మెరుగ్గానే ఉంటుంది.

గ్లామర్ రంగంలో రాణింపు: వీరికి కళలంటే ప్రాణం. సంగీతం, నటన, ఫ్యాషన్ డిజైనింగ్ లేదా సినిమా రంగాల్లో వీరు తక్కువ శ్రమతోనే గొప్ప పేరు సంపాదిస్తారు.

స్మార్ట్ వర్క్: శారీరక శ్రమను వీరు పెద్దగా ఇష్టపడరు. క్లిష్టమైన పనులను కూడా తమ తెలివితేటలతో చాలా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా పరిష్కరించుకోగలరు.

కుటుంబ అనురాగం: కుటుంబం, పిల్లలు అంటే వీరికి అమితమైన ప్రేమ. వీలు దొరికినప్పుడల్లా పర్యటనలు, పార్టీలు చేస్తూ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. సంఖ్యాశాస్త్రం అనేది సామాన్య నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.