AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: వృషభ రాశిలోకి బుధ గ్రహ సంచారం.. వారి బ్యాంక్ బ్యాలెన్స్‌కు ఇక కొదవ ఉండదు అంతే..! మరి మీకు ఎలా ఉంటుందంటే..

ప్రస్తుతం గురువు తన మిత్ర క్షేత్రమైన మేషరాశి లోను, ఈ నెల 8వ తేదీ నుంచి బుధుడు తన మిత్ర క్షేత్రమైన వృషభ రాశిలోనూ సంచారం చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రెండు శుభ గ్రహాలు చాలా రాశుల వారికి అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ గ్రహాలు ఏ రాశి వారికి ఏ విధంగా పనిచేస్తాయి, ఏ ఏ రాశుల వారికి సంతృప్తికరమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అనే విషయాలు ఇక్కడ పరిశీలిద్దాం.

Money Astrology: వృషభ రాశిలోకి బుధ గ్రహ సంచారం.. వారి బ్యాంక్ బ్యాలెన్స్‌కు ఇక కొదవ ఉండదు అంతే..! మరి మీకు ఎలా ఉంటుందంటే..
Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 05, 2023 | 6:21 PM

Share

Astrology in Telugu: సాధారణంగా ఆర్థిక నిల్వలు లేదా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గురు, బుధ గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్న పక్షంలో బ్యాంక్ బ్యాలెన్స్ కు కొదవ ఉండదు. ప్రస్తుతం గురువు తన మిత్ర క్షేత్రమైన మేషరాశి లోను, ఈ నెల 8వ తేదీ నుంచి బుధుడు తన మిత్ర క్షేత్రమైన వృషభ రాశిలోనూ సంచారం చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రెండు శుభ గ్రహాలు చాలా రాశుల వారికి అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ గ్రహాలు ఏ రాశి వారికి ఏ విధంగా పనిచేస్తాయి, ఏ ఏ రాశుల వారికి సంతృప్తికరమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అనే విషయాలు ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేష రాశి: ఈ రాశిలో గురు గ్రహం, రెండవ స్థానంలో అంటే ధనస్థానంలో బుధ గ్రహం సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ సంతృప్తి కరంగానే ఉండే అవకాశం ఉంది. గురు గ్రహంతో రాహువు కూడా కలిసి ఉన్నందువల్ల కొద్దిగా ఆకస్మిక ధన నష్టానికి, అనవసర ఖర్చులకు కూడా అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక నిల్వలకు లోటు లేనప్పటికీ ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. డబ్బు ఇవ్వటం తీసుకోవడం వంటివి చేయకపోవడం శ్రేయస్కరం.
  2. వృషభ రాశి: సాధారణంగా ఆర్థిక విషయాలలో ఎంతో జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ఉండే ఈ రాశి వారు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక నిల్వలు బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వచ్చే 15వ తేదీ దాటిన తరువాత బ్యాంక్ బ్యాలెన్స్ మరికొంత పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ లోపల కొద్దిగా ఆర్థిక వ్యవహారా లలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. స్నేహితులే అయినప్పటికీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు.
  3. మిథున రాశి: ఈ రాశి వారికి ఆదాయ స్థానంలో ధనకారకుడైన గురువు సంచరిస్తున్నప్పటికీ రాశి అధిపతి అయిన బుధుడు వ్యయంలో ప్రవేశించినందువల్ల ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక నిల్వలు తగ్గకుండా గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మొహ మాటాలు, మితిమీరిన ఔదార్యం కారణంగా డబ్బు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. శుభకార్యాల మీద ఖర్చు చేయడం కూడా జరుగుతుంది. విందులు వినోదాల మీద లేక విలాసాల మీద ఎక్కువగా ఖర్చు కావచ్చు.
  4. కర్కాటక రాశి: బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో ఈ రాశి వారికి గురు, బుధ గ్రహాలు రెండు కూడా అనుకూలంగా ఉండటం జరుగుతుంది. ఆదాయం పెరుగు తుంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వీటన్నిటికీ తోడు పొదుపు నియమాలు కఠినంగా పాటిస్తారు. అందువల్ల ఒక నెలా 15 రోజులపాటు ఆర్థిక నిల్వలకు పెరుగు దలే కానీ తరుగుదల ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎంత ప్రయత్నిస్తే అంతగా ఆదాయం పెరుగుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఈ రాశి వారికి కూడా ప్రస్తుతానికి ఆర్థిక నిల్వలకు లోటు ఉండకపోవచ్చు. అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తోంది. ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. మన శ్శాంతిగా, ప్రశాంతంగా బతకటానికి అవకాశం కలుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇతరులకు వాగ్దానం చేయటం గాని, హామీలు ఉండటం గాని ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఆర్థిక విషయాలను ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీకు రావలసిన డబ్బు విషయంలో శ్రద్ధ పెట్టడం అవసరం.
  7. కన్యా రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతానికి ఎక్కువగా ఆర్థిక నిల్వలు ఉండే అవకాశం లేదు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశికి అధిపతి అయిన బుధ గ్రహం భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ, ధన కారకు డైన గురుగ్రహం అష్టమ స్థానంలో ఉండటం వల్ల అనుకోని ఖర్చులు మీద పడటం, ఇతరులను తప్పనిసరిగా ఆదుకోవలసి రావటం, రావలసిన డబ్బు చేతికి అందకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
  8. తులా రాశి: గురు, బుధ గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. విలాసాల మీద విందులు, వినోదాల మీద, విహార యాత్రల మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థిక నిల్వలలో మాత్రం తగ్గుదల కనిపించే అవకాశం లేదు. వృత్తి వ్యాపారాల పరంగా ఆదాయం పెరగటంతో పాటు అదనపు ఆదాయ వనరులు సమకూరే సూచనలు కూడా ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో ఈ రాశి వారు కొద్ది కాలం పాటు ఆలోచించవలసిన అవసరం ఉండకపోవచ్చు.
  9. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి బుధ గ్రహం మాత్రం అను కూలంగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ అతి తక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబం మీద ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. అవసర ఖర్చులతోనే ఇబ్బంది పడాల్సి వస్తుంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. అందువల్ల డబ్బు రావటం, పోవటం వంటి విషయాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు సహాయం చేయడానికి ఇది సమయం కాదు. ఇతరులకు వాగ్దానం చేయటం హామీలు ఉండటం, మంచిది కాదు.
  10. ధనూ రాశి: ఈ రాశి వారికి ధన కారకుడు అయిన గురువు, బ్యాంక్ బ్యాలెన్స్ కు కారకుడు అయిన బుధుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక నిల్వలను గురించిన చింత ఉండదు. ఇతరులకు సహాయం చేసేంత స్థాయిలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇది వచ్చేవారం నుంచి మరింతగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. షేర్లు లాటరీలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది. అయితే శుభకార్యాలు దైవ కార్యాల మీద డబ్బు బాగా ఖర్చయ్యే అవకాశం కనబడుతోంది.
  11. మకర రాశి: కొత్త కమిట్మెంట్స్, కొత్త పథకాలు ఏవీ లేని పక్షంలో ఈ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ కు లోటు ఉండకపోవచ్చు. ఇతరులకు అనవసర సహాయాలు చేయకపోవడం మంచిది. ప్రస్తుతా నికి ఈ రాశి వారు ఆర్థిక నిర్వహణకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ రాశి వారి చేతుల మీదుగా జరిగే ఆర్థిక లావాదేవీల వల్ల నష్ట పోవడం జరుగుతుంది. డబ్బు వ్యవహారాలను డీల్ చేయకపోవడం మంచిది. దాన ధర్మాలు, వితరణ కార్యక్రమాల వల్ల బాగా డబ్బు నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
  12. కుంభ రాశి: ఈ రాశి వారికి గురు గ్రహం ఆశించినంతగా అనుకూలంగా లేనప్పటికీ బుధ గ్రహం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల బ్యాంక్ బ్యాలెన్స్ నిలకడగా ఉండే అవకాశం ఉంది. పెద్దగా పెరుగుదల లేనప్పటికీ తరుగుదలకు మాత్రం అవకాశం లేదు. పొదుపు సూత్రాలను కఠినంగా, నిక్కచ్చిగా అనుసరించడం జరుగుతుంది. పిసినారితనాన్ని అలవర్చుకోవడం ప్రారంభం అవుతుంది. వాగ్దానాలు చేయడం హామీలు ఉండటం జరిగే పని కాదు. మూడవ కంటికి తెలియకుండా డబ్బు దాచే అవకాశం కూడా ఉంది.
  13. మీన రాశి: ఈ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ యధాతధంగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు వేయటం, తీయటం రెండింటికి అవకాశం తక్కువ. అదనపు ఆదాయంతోనే సరిపుచ్చు కోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీరి దృష్టి అంతా ఆర్థిక సమస్యల పరిష్కారం మీద, ఆదాయం పెంచుకోవడం మీద కేంద్రీకృతం అయి ఉంటుంది. ఆర్థిక నిల్వలను పెట్టుబడులుగా మార్చడానికి అవకాశం ఉంది. ఏదైనా ఖర్చు అంటూ జరిగితే అది సాధారణంగా దైవకార్యాల మీదే అయి ఉంటుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..