AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercury Astro Tips: జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే కనిపించే సంకేతాలు ఏమిటి? పరిహారాలు ఏమిటంటే

ప్రతి ఒక్కరూ పదునైన తెలివితేటలు కలిగి ఉండాలని, జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. అయితే జ్యోతిషశాస్త్రంలో తెలివితేటలకు గ్రహానికి సంబంధం ఉందని పేర్కొంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం మనిషి జాతకంలో కొన్ని గ్రహాల స్థానం మనిషి తెలివితేటలు, అభ్యాస సామర్థ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ రోజు ఏ గ్రహం తెలివి తేటలను ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం..

Mercury Astro Tips: జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే కనిపించే సంకేతాలు ఏమిటి? పరిహారాలు ఏమిటంటే
Strong Mercury In Kundli
Surya Kala
|

Updated on: Aug 14, 2025 | 11:02 AM

Share

సర్వసాధారణంగా ప్రజలు పదునైన మనస్సు, తెలివితేటలు విద్య, కృషి,అనుభవం నుంచి మాత్రమే వస్తాయని నమ్ముతారు. అయితే ఈ నమ్మకంలో నిజం ఉంది. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో ఒక నిర్దిష్ట గ్రహం ఒక వ్యక్తి తెలివితేటలు, తార్కికం, అవగాహన సామర్థ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ గ్రహం ఎవరి జాతకంలో బలమైన స్థితిలో ఉంటే.. ఆ వ్యక్తి చదువులో మాత్రమే కాకుండా నిర్ణయం తీసుకునే సామర్థ్యం, విశ్లేషణాత్మక శక్తి , కమ్యూనికేషన్ నైపుణ్యాలలో కూడా ముందుంటాడు. ఏ గ్రహం బలం మనుషులకు పదునైన తెలివితేటలను ఇస్తుందో తెలుసుకుందాం..

బుధుడు.. తెలివితేటల మధ్య సంబంధం

జ్యోతిషశాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, వాక్కు, తార్కికం, జ్ఞాపకశక్తి, వ్యాపారానికి కారకంగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఎంత బలంగా ఉంటే ఆ వ్యక్తి మనస్సు అంత పదునుగా, తెలివిగా ఉంటుంది. బుధుడు బలహీనంగా ఉన్న వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకోవచ్చు. చదువులో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు బలహీనంగా కూడా ఉండవచ్చు.

జాతకంలో బుధుడు బలంగా ఉంటే ఎలాంటి సంకేతాలు ఉంటాయి?

  1. పదునైన తెలివితేటలుజ్ఞాపకశక్తి: బుధ స్థానం బలంగా ఉన్న వ్యక్తులు చాలా త్వరగా నేర్చుకుంటారు. చాలా మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. ఎటువంటి సంక్లిష్టమైన విషయాలను అయినా సులభంగా అర్థం చేసుకుంటారు.
  2. నైపుణ్యం కలిగిన వక్తలు, సంభాషణకర్తలు: బుధుడు బలంగా ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను సమర్థవంతంగా వ్యక్తీకరించడంలో నిష్ణాతులు. వీరు తమ ప్రసంగంతో ఇతరులను ప్రభావితం చేయగలరు. రచన, జర్నలిజం, న్యాయవాద లేదా మార్కెటింగ్ వంటి రంగాలలో సక్సెస్ అవుతారు.
  3. తార్కిక ఆలోచన: ఈ వ్యక్తులు ఏ సమస్యను అయినా తార్కికంగా పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. మంచి, చెడులను సులభంగా నిర్ణయించగలరు.
  4. వ్యాపారంలో విజయం: బుధుడిని వ్యాపారానికి కారకుడిగా కూడా పరిగణిస్తారు. అందువల్ల బుధుడు బలంగా ఉన్న వ్యక్తి వ్యాపరంలో అడుగు పెడితే.. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదుగుతారు.

బుధుడు బలహీనంగా ఉంటే కనిపించే సంకేతాలు ఏమిటి?

  1. ఎవరి జాతకంలోనైనా బుధుడు బలహీనంగా ఉన్నా లేదా బుధ దోష ప్రభావంతో బాధపడుతుంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
  2. చదువులో ఆసక్తి లేకపోవడం: ఇలాంటి వ్యక్తులు విషయాలను అర్థం చేసుకోవడంలో, గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడతారు. తరచుగా చదువుకు దూరంగా ఉంటారు.
  3. మాట లోపం: బుధుడు బలహీనంగా ఉండటం వల్ల వ్యక్తికి నత్తిగా మాట్లాడటం, మాట్లాడేటప్పుడు నత్తిగా రావడం లేదా తన అభిప్రాయాన్ని సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం వంటి సమస్యలు ఉండవచ్చు.
  4. నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది: ఈ వ్యక్తులు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవాలంటే గందరగోళానికి గురవుతారు. ఏది సరైనది అనే విషయం గుర్తించలేరు. తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
  5. జ్ఞాపకశక్తి బలహీనం: బుధ స్థానం బలహీనంగా ఉంటే వారు జ్ఞాపకశక్తి బలహీనంగా ఉండవచ్చు.. వారు చిన్న విషయాలను కూడా మర్చిపోతారు.

బుధ గ్రహాన్ని బలోపేతం చేయడానికి జ్యోతిషశాస్త్ర పరిహారాలు

  1. బుధవారం ఉపవాసం: ప్రతి బుధవారం గణేశుడిని పూజించండి , వీలైతే ఉపవాసం ఉండండి. గణేశుడిని జ్ఞాన దేవుడిగా భావిస్తారు.
  2. పచ్చ రత్నం ధరించండి: అర్హత కలిగిన జ్యోతిష్కుడి సలహా తీసుకుని జాతకం ప్రకారం పచ్చ రత్నాన్ని ధరించవచ్చు. ఇది బుధ గ్రహాన్ని సూచిస్తుంది.
  3. బుధ మంత్ర పారాయణం: ప్రతిరోజూ “ఓం బం బుధాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి.
  4. ఆకుపచ్చ వస్తువులను దానం చేయండి: బుధవారం పచ్చి పెసలు, పాలకూర, ఆకుపచ్చ బట్టలు లేదా ఆకుపచ్చ కూరగాయలను దానం చేయండి.
ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.