Vivaha Yoga: గురు, శక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి వివాహ యోగం పక్కా! అందులో మీ రాశి ఉందా..?

గ్రహ సంచారంలో గురు, శుక్ర గ్రహాలు ఎక్కడ కలిసినా తప్పకుండా వివాహాలు, గృహ ప్రవేశాలు తదితర శుభ కార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రస్తుతం సహజ కుటుంబ స్థానమైన వృషభ రాశిలోనే ఈ రెండు శుభ గ్రహాలు కలిసినందువల్ల వివాహ కార్యక్రమాలు జోరందుకునే అవకాశం ఉంది. ఈ రాశుల వారి వివాహ ప్రయత్నాలు సునాయాసంగా నెరవేరుతాయి. రెండు నెలల పాటు సంబంధాల విషయంలో చేపట్టే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి.

Vivaha Yoga: గురు, శక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి వివాహ యోగం పక్కా! అందులో మీ రాశి ఉందా..?
Vivaha Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 23, 2024 | 6:12 PM

గ్రహ సంచారంలో గురు, శుక్ర గ్రహాలు ఎక్కడ కలిసినా తప్పకుండా వివాహాలు, గృహ ప్రవేశాలు తదితర శుభ కార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రస్తుతం సహజ కుటుంబ స్థానమైన వృషభ రాశిలోనే ఈ రెండు శుభ గ్రహాలు కలిసినందువల్ల వివాహ కార్యక్రమాలు జోరందుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి వివాహ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు సునాయాసంగా నెరవేరుతాయి. రెండు నెలల పాటు సంబంధాల విషయంలో చేపట్టే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి.

  1. మేషం: ఈ రాశికి కుటుంబ స్థానంలో శుక్ర, గురువులు కలిసినందువల్ల పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న వివాహాలన్నీ పూర్తవుతాయి. ఈ రాశివారికి సాధారణంగా దగ్గర బంధువులతో సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాలు కలిసిన రాశి కుటుంబ, ధన స్థానం అయినందువల్ల వివాహ జీవితం వల్ల సిరిసంపదలు పెరగడానికి అవ కాశముంటుంది. త్వరలో ఈ రాశివారు పెళ్లి సంబంధమైన శుభవార్తలు వినడం జరుగుతుంది.
  2. వృషభం: ఈ రాశిలోనే శుక్ర, గురుల యుతి జరిగినందువల్ల వివాహ సంబంధం కుదరడానికి, వివాహం జరగడానికి ఈ సమయం బాగా అనుకూలంగా కనిపిస్తోంది. కొద్ది ప్రయత్నంతో వీరికి అంచనాలకు మించిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. సాధారణంగా బంధువుల్లో వీరికి సంబందం కుదర వచ్చు. వీరికి వివాహానంతర యోగం పట్టడానికి అవకాశం ఉంది. జీవితంలో అనేక విధాలుగా స్థిరత్వం లభిస్తుంది. గురు, శుక్రుల అనుకూలత వల్ల వీరి దాంపత్య జీవితం వైభవంగా సాగిపోతుంది.
  3. కర్కాటకం: ఈ రాశివారికి లాభస్థానంలో ఈ శుభ గ్రహాల సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సాధారణంగా పరిచయస్థులు లేదా పలుకుబడి కలిగిన వ్యక్తుల కుటుం బంలో సంబంధం కుదురుతుంది. వైభవోపేతంగా, సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగే అవకాశ ముంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. పెళ్లి తర్వాత నుంచి వీరి జీవితం పురోగతి చెందు తుంది. శుక్రుడి అనుకూలత ఎక్కువగా ఉన్నందువల్ల వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతుంది.
  4. కన్య: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్ర, గురుల యుతి వల్ల కొద్ది ప్రయత్నంతో విదేశీ సంబంధం లేదా సంపన్న కుటుంబానికి చెందిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. అతి త్వరలో ఈ రాశివారికి వివాహం జరిగే సూచనలున్నాయి. సాంప్ర దాయబద్ధంగా వివాహం జరుగుతుంది. భాగ్య స్థానంలో ఈ రెండు శుభ గ్రహాలు కలవడం వల్ల సాధారణంగా ఈ రాశివారికి వివాహ మూలక ధన లాభం ఉంటుంది. జీవితం సామరస్యంగా సాగిపోతుంది. వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది.
  5. వృశ్చికం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో, అంటే వివాహ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాలు యుతి చెందడం వల్ల సాధారణంగా ఇష్టపడిన సంబంధం లేదా ప్రేమ సంబంధంతో వివాహం జరిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వీరికి ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. వివాహం వైభవంగా జరిగే అవకాశం ఉంది. ఇద్దరూ ఉద్యోగులు అయి ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వివాహం అయ్యే పక్షంలో ఈ రాశివారి వైవాహిక జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది.
  6. మకరం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలిసినందువల్ల వీరికి తప్పకుండా ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది. బాగా తెలిసిన వ్యక్తితో లేదా సన్నిహితులతో వివాహం జరగ డానికి కూడా అవకాశం ఉంది. వీరికి అతి త్వరలో పెళ్లయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి పట్ల నిబద్ధతతో వ్యవహరించే లక్షణం ఉన్నందువల్ల వీరి వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. ఈ రాశివారికి నిరాడంబరంగా వివాహం జరిగే అవకాశం ఉంది.