AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangal Dosh Upay: జాతకంలో మంగళ దోషంతో ఇబ్బంది పడుతున్నారా .. ఈ నివారణ చర్యలు అత్యంత ఫలవంతం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎవరి జాతకంలో కుజుడు  బలహీనంగా ఉన్నా, లేదా కుజ దోషం ఉందని చెప్పేవారు.. వారు తరచుగా బలహీనత కలిగి ఉంటారు. కుజ దోషంతో సమస్య లు ఎదురవుతూ ఉంటాయి. ఎవరి జాతకంలో కుజుడు అశుభ దృష్టిలో ఉంటే. మంగళవారం చేయాల్సిన కొన్ని నివారణ చర్యలు అత్యంత ఫలవంతం అవుతాయి. ఎవరి జాతకంలో అంగారక దోషం ఉంటే.. దానిని తొలగించడానికి మంగళవారం అంగారకుడి అనుగ్రహం కోసం మంత్రాన్ని జపించాలి - 'ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం' లేదా రుణ విముక్తి మంగళ స్తోత్రాన్ని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో పఠించాలి.

Mangal Dosh Upay: జాతకంలో మంగళ దోషంతో ఇబ్బంది పడుతున్నారా .. ఈ నివారణ చర్యలు అత్యంత ఫలవంతం..
Mangal Dosh Upay
Surya Kala
|

Updated on: Aug 01, 2023 | 10:30 AM

Share

జ్యోతిషశాస్త్రంలో అంగారకుడు లేదా కుజుడు తొమ్మిది గ్రహాల్లో ఉగ్ర స్వభావుడు. కుజుడు భూమి, భవనం, సోదరుడు, ధైర్యం, శౌర్యం, శక్తి మొదలైన వాటికి కారకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ గ్రహం ఎరుపు రంగులో ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎవరి జాతకంలో కుజుడు  బలహీనంగా ఉన్నా, లేదా కుజ దోషం ఉందని చెప్పేవారు.. వారు తరచుగా బలహీనత కలిగి ఉంటారు. కుజ దోషంతో సమస్య లు ఎదురవుతూ ఉంటాయి. ఎవరి జాతకంలో కుజుడు అశుభ దృష్టిలో ఉంటే. మంగళవారం చేయాల్సిన కొన్ని నివారణ చర్యలు అత్యంత ఫలవంతం అవుతాయి.

  1. ఎవరి జాతకంలో అంగారక దోషం ఉంటే.. దానిని తొలగించడానికి మంగళవారం అంగారకుడి అనుగ్రహం కోసం మంత్రాన్ని జపించాలి – ‘ధరణీ గర్భ సంభూతం – విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం – తం మంగళం ప్రణమామ్యహం’ లేదా రుణ విముక్తి మంగళ స్తోత్రాన్ని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో పఠించాలి.
  2. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రకాల మంత్రాలు, స్తోత్రాలను పఠించడం మంత్రమే కాదు.. స్నేహితులను,  సోదరుడిని సంతోషంగా ఉంచడం ద్వారా అంగారకుడి శుభ దృష్టిని పొందవచ్చు. శుభ ఫలితాలను పొందుతారు.
  3. మంగళ దోషాన్ని తొలగించడానికి మంగళవారం ఉపవాసం అత్యంత ఫలవంతం. ఈ ఉపవాస దీక్ష ఏ నెలలోనైనా శుక్లపక్షం మంగళవారం ప్రారంభించవచ్చు. హిందూ విశ్వాసం ప్రకారం 28 మంగళవారాలు ఉపవాసం ఉండటం ద్వారా సాధకుడి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది.
  4. జాతకంలో మంగళదోషం ఉండి దీని వల్ల వచ్చే అడ్డంకుల వల్ల ఇబ్బంది పడుతుంటే, దానిని నివారించడానికి, మంగళవారం ఆలయ పూజారికి శక్తిమేరకు దానం చేయండి.
  5. ఇవి కూడా చదవండి
  6. హిందూ విశ్వాసం ప్రకారం జాతకంలో మంగళ దోషం ఉంటే దానిని తొలగించడానికి.. మంగళవారం హనుమంతుడి విగ్రహం లేదా ఫోటో ముందు దీపం వెలిగించి, బజరంగ్ బాన్ పారాయణం పూర్తి భక్తి , విశ్వాసంతో చేయాలి.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో మంగళదోషం తొలగిపోవడానికి జ్యోతిష్యుడిని సంప్రదించిన తర్వాత పగడాన్ని ధరించండి.
  7. జాతకంలో కుజుడు బలహీనంగా ఉండి, జీవితంలో అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అది సాధ్యం కాకపోతే మీరు ఎరుపు రంగు రుమాలను ఉపయోగించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)